Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 19

1Ariesమేషం

ఆర్ధిక లావాదేవీలందు సమస్యలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. అదనపు ఖర్చు లుంటాయి. ముఖ్య వ్యక్తులను కలుసుకొన వీలుకాదు. శుభకార్య ప్రయత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు అందుకొనే అవకాశం కలదు. ఉద్యోగులకు విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. కుటుంబసౌఖ్యము బాగుంటుంది.

 

2Taurusవృషభం

వ్యాపారాలు, వృత్తి జీవనం సామాన్యంగా జరుగు తుంది. ఆదాయం ఫరవాలేదు. తొందరపాటు మాటలు, ప్రవర్తనను అదుపు చేసికొనడం మంచిది. ఆరోగ్యం ఫరవాలేదు. ఋణ బాధలు కొంత తగ్గుతాయి. బిల్లులు చెల్లింపులు జరుగుతాయి. కళ క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ విషయంలో కాని తొందరపాటు నిర్ణయాలు వద్దు.

 

3Geminiమిధునం

వ్యవహారాలు ఇంట్లోవైనా, బయటవి అయినా మెలకువ వహించాలి. మొగమాటాలకు వత్తిళ్ళకు లొంగితే ఇబ్బందులు రాగల అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అవసరాలకు ఋణం చేయ వలసి రావచ్చును. ఆర్ధికపరమైన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులను ఎంత జాగ్రత్తగా నిర్వహించినను ఆటంకాలుంటాయి. విద్యా కృషి బాగుంటుంది.

 

4Cancerకర్కాటకం

ఆర్ధిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. వృత్తి జీవనం కలవారికి, చిన్న చిన్న వ్యాపారవర్గాలకు ఆదాయం సంతృప్తికరము. పెద్ద వ్యాపారులకు అంత సంతృప్తి ఉండదు. బాకీలు కొంత వసూలు కాగలవు. బంధు వర్గంతో స్వల్ప విభేదాలు చోటు చేసికొంటాయి. ఉద్యోగ వర్గాలు అధికారుల ఆదరణ బాగుండి బాధ్యతలు సమర్ధ వంతంగా నిర్వహిస్తారు.

 

5Leoసింహం

అనుకొన్న పనులు కొన్ని ఆకస్మికంగా నెరవేరు తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం బాగుంటుంది. అయినా అదనపు ఖర్చులు కూడా వదిలిపెట్టవు. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం ఉంటుంది. పెద్ద వ్యాపారవర్గాలు, అధికారులపై అవినీతి నిరోధక అధికారుల దాడి ఉండవచ్చును. శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి.

 

6Virgoకన్య

ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్యాపార వర్గాలకు పురోగతి బాగుండి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలు లభిస్తాయి. పెండింగ్‌ లోని ఇబ్బందులు తొలుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలించగలవు. బంధుమిత్రులను కలుసుకొంటారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. శుభవార్తలు వినగలరు. రావలసిన బాకీలు కొంతవరకు అందుతాయి.

 

7Libraతుల

కుటుంబ వ్యవహారాలలో ఇబ్బందులు రాకుండా మెలగండి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం బాగుంటుంది. మిమ్మల్ని విమర్శించే వారుంటారు, కాని పట్టించుకోవద్దు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు, కొత్త నిర్మాణాలు చేపట్టే ఆలోచనలుంటాయి.

 

8Scorpioవృశ్చికం

ఆర్ధిక వ్యవహారాలలో ముందుచూపుతో చక్కగా ప్రణాళికలను ఏర్పరచుకొంటారు. వృత్తివ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసికొనే పరిస్థితి ఇతరుల వల్ల కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఒకటి రెండు అనవసరపు ఖర్చులు పైనబడతాయి. స్థిరాస్తుల లావాదేవీలు కొద్దికాలం వాయిదా వేయండి. ఆరోగ్యం బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఖర్చులు పెరిగి ఆర్ధిక ఇబ్బందులుంటాయి. వ్యాపార వర్గాలకు అవకాశాలు చేజారిపోవచ్చును. వృత్తి జీవనం కలవారికి, చిరువ్యాపారులకు ఫరవాలేదు. అనుకున్న పనులు సరిగా జరగక ఆలస్యం కాగలవు. కొందరి ప్రవర్తనవల్ల మనస్సుకు కష్టం కలుగవచ్చును. ఉద్యోగు లకు విధి నిర్వహణలో అప్రమత్తత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యము బాగుంటుంది.

 

10Capricornమకరం

మంచి ఖర్చు తగలవచ్చును. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేర డానికి లౌకికంగా ప్రవర్తించండి. అనుకూలంగా జరిగి పోతాయి. వ్యాపారవర్గాలకు అభివృద్ధి తగ్గి ఆదాయం కొంతవరకు తగ్గుతుంది. శాస్త్ర సాంకేతిక క్రీడా కళా రంగాల వారికి మంచి అవకాశాలు రాగలవు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విభేదాలు వచ్చి సర్దుబాటు కాగలవు.

 

11Aquariusకుంభం

ఖర్చులు ఎక్కువైనా ఆర్ధిక ఇబ్బందులు బాధించవు. వృత్తి వ్యాపార వర్గాలకు ఆదాయం పెరుగుతుంది. గృహ వస్తు వాహన రిపేర్లు ఉండగలవు. ప్రభుత్వ సంబంధ మగు పనులు నిదానంగా జరిగి విసుగు, టెన్షన్‌ కలిగి స్తాయి. శుభకార్యం నిర్ణయం కావచ్చును. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించగలవు. ఉద్యోగులకు అధికారు లకు పనిభారం పెరుగుతుంది.

 

12Piscesమీనం

సొంత పనులు అనుకున్న విధంగా జరగక టెన్షన్‌ పడతారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు కలసివస్తాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. రావలసిన బాకీలు వసూలు కాగలవు. శుభకార్యాలు నిర్ణయం కావడం, దూర ప్రయాణాలుంటాయి. అధికారులకు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందడం జరుగుతుంది. విద్యా ప్రగతి బాగుంటుంది.

galpikaజనవరి 12వ తేదీ... వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు గవర్నర్‌ పురోహిత్‌, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, కామినేని శ్రీనివాస్‌ తదితరు లంతా సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు స్పెషల్‌గా చేయించిన అరిసెలు తిన్నారు. కార్యక్రమం ముగిసాక వెంకయ్యనాయుడు మైకు పట్టుకుని అందర్నీ ఉద్దేశించి నేను ఈరోజు నుండి 16వ తేదీ పొద్దున దాకా ఇక్కడే వుంటాను, అయితే ఎవరూ నన్ను కలవడానికి రావద్దు. మీరొ చ్చినా నేను కనిపించను అని చెప్పాడు. ఆ మాటకు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆయన అలా ఎందుకన్నాడో అర్ధం కాలేదు. సరేలే అంటూ ఎవరి దారిన వాళ్ళు పోయారు. వెంకయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాత్రికి అక్కడే పడు కున్నారు.

----------

13వ తేదీ తెల్లవారుజామున 4గం టలు... నాకు ఇదే చివరి కూత అన్నట్లు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో భోగి పండుగ కోసం తెచ్చిపెట్టిన కోడిపుంజు కూత పెట్టింది. ఆ కూతకు వెంకయ్య సతీమణి ఉషమ్మకు టక్కున మెలకువ వచ్చింది. కళ్లు తెరచి చూస్తే వెంకయ్య లేడు. ఒకవేళ లేచి బాత్రూంకు వెళ్లాడేమోనని పది నిముషాల పాటూ కళ్ళు తెరచి చూడసాగింది. బాత్‌రూంలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఆమెకు అనుమాన మొచ్చింది. ఆదుర్దాగా లేచి బయటకొచ్చింది. కాని ఎక్కడా ఆయన కనిపించలేదు. ఆందో ళనతో హర్ష, దీపా వెంకట్‌లను లేపింది. అందరూ ఆందోళన చెందుతూ ట్రస్ట్‌ ప్రాంగణమంతా వెదుకుతూ బయటకొచ్చారు. అక్కడ గుడి వద్ద ఒక పిల్లాడు మాత్రం కని పించాడు. ధనుర్మాసం కాబట్టి తెల్లారు జామునే పూజారులు గుడి తెరచి పూజలు చేస్తుంటారు. పూజారి పెట్టే ప్రసాదం కోసమే ఆ పిల్లాడు అరగంట నుండి అక్కడ నిలబడి నట్లుగా వుంది. ఖాకీ నిక్కరు, లాగూ చొక్క వేసుకున్న ఆ పిల్లాడిని చూస్తే దీపావెంకట్‌కు ఎక్కడో చూసినట్లు అనిపించసాగింది. అయినా ఆ కుర్రాడి వద్దకు వెళ్ళి... బాబూ ఇటు వెంకయ్యనాయుడు తాత రావడం ఏమన్నా చూసావా అని అడిగింది. లేదమ్మా అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. దీపావెంకట్‌కు బాధేసింది. వెంకయ్య ఫ్రెండ్స్‌ అందరికీ ఫోన్‌లు చేసి నాన్నగారు మీ ఇంటి కేమన్నా వచ్చారా అని అడిగింది. అందరి నుండి రాలేదని సమాధానం. ఈలోపు వెంకయ్య తప్పిపోయాడన్న వార్త దావా నలంలా వ్యాపించింది. టీవీ ఛానెల్స్‌ 'కత్తి మహేష్‌ వర్సెస్‌ అజ్ఞానవాసి' సబ్జెక్ట్‌ను కూడా పక్కన పెట్టేసి 'తప్పిపోయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - దేశం మొత్తం ఆందో ళన' అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు ఇవ్వసాగాయి. వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్‌ సమావేశం పెట్టాడు. ఆయన ఎలా తప్పిపోయాడనే దానిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాడు. ఉపరాష్ట్రపతిని వెదకడానికి వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్‌లను రంగంలోకి దించారు. నెల్లూరుజిల్లాలోని అన్ని మండలాలను జల్లెడపట్టడానికి ప్రత్యేక బలగాలను నెల్లూ రుకు తరలించారు. వెంకయ్య తప్పిపోయా డనే సమాచారంతో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులందరూ ట్రస్ట్‌కు చేరుకు న్నారు. సోమిరెడ్డి అయితే భయపడుతున్న

ఉషమ్మ, దీపమ్మలను ఓదారుస్తూ.... భారత దేశంలో అణువణువు తెలిసిన నాయకు డమ్మా మా నాయుడు గారు. ఆయన తప్పి పోవడం పెద్ద జోక్‌. ఆయన కనిపించకుండా ఉండడం వెనుక ఏదో ట్విస్ట్‌ ఉంటుంది అని ధైర్యం చెప్పాడు.

వీళ్ళందరూ ఇక్కడ ఆందోళనలో

ఉండగానే పొద్దున గుళ్ళో ప్రసాదం కోసం నిలబడి వున్న కుర్రాడు సైకిల్‌పై తాటాకుల మోపులు తెచ్చి ట్రస్ట్‌ ప్రాంగణం వద్ద పెట్టాడు. మళ్ళీ సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాడు. కొద్దిసేపటికి ఇంకో తాటాకుల కట్ట తెచ్చాడు. ఇలా పది తాటాకుల కట్టలు అక్కడ పేర్చాడు. అందరూ ఆ కుర్రాడిని చూస్తున్నారేగాని, వెంకయ్య కనిపించలేదనే షాక్‌లో ఎవరూ సీరియస్‌గా పట్టించుకోలేదు. వీళ్ళు ఈ స్థితిలో ఉండగానే ఆ కుర్రాడు సైకిల్‌ టైరుతో కొద్ది సేపు ఆడుకున్నాడు. ఇంకో నలుగురు పిల్ల లను తోడు తీసుకుని వచ్చి టెంకాయ మట్ట మీద ఒకరు ఎక్కితే ఇద్దరు లాగే ఆటాడు కున్నారు. ఆ పిల్లలంతా చెట్లు ఎక్కి కొద్దిసేపు కోతికొమ్మచ్చి ఆడుకున్నారు. కొద్దిసేపు వంగులు దూకుళ్ళు, బిళ్లాకోడు ఆడుకు న్నారు. వెంకయ్య కోసం ఎవరి వెదుకు లాటలో వాళ్ళున్నారు. ఈ లోకంతో నాకేం సంబంధమన్నట్లు ఆ కుర్రాడు మాత్రం అక్కడ గురుకుల పాఠశాల విద్యార్థుల వసతి గృహం లోనే పడుకుని ఆ రాత్రికి నిద్రపోయాడు.

14వ తేదీ తెల్లారుజామున 3గంటలు. తలుపు తట్టిన శబ్దమొచ్చేసరికి తమ నాయన వచ్చాడేమోనని దీపావెంకట్‌ ఆత్రుతగా తలుపులు తీసింది. ఎదురుగా గుళ్లో చూసిన కుర్రాడు. ఏంటని అడిగింది. భోగి మంట వేసుకుందాం రామ్మా... అని ఆ పిల్లాడు పిలిచాడు. అందుకామె నాకు పండుగ చేసుకునే మూడ్‌ లేదు, మా నాయన వస్తేనే పండుగ చేసుకుంటాం అని చెప్పింది. దానికి ఆ పిల్లోడు ఆమె చేయి పట్టుకుని, మీ నాయన చిన్నపిల్లాడేం కాదు తప్పించుకుపోవడానికి, సాయంత్రానికల్లా వస్తాడులే రామ్మా అంటూ భోగి మంట వద్దకు తీసుకెళ్లాడు. ఉషమ్మ, హర్షలు కూడా లేచి భోగిమంట వద్దకు వచ్చారు. ఆ కుర్రాడు వరుసబెట్టి తాటాకులను మంటలో వేస్తున్నాడు. కరెంట్‌ స్థంభాల తీగలను తాకేలా మంట ఎగబాకింది. అక్క డున్న స్కూల్‌ పిల్లలు ఆ మంటలు చుట్టూ చేరి చలి కాచుకుంటూ కేరింతలు కొడుతు న్నారు. భోగి మంటలు అయ్యాక ఆ పిల్లోడు దీపాతో... బజారుకుపోయి చికెన్‌ తెస్తాను, నాకు దోశ, చికెన్‌ చేసి పెట్టమ్మా అని అడి గాడు. పిల్లాడు కదా... నోరు తెరిచి అడిగాడు అని ఆమె కాదనలేకపోయింది. దీపమ్మ చేసి పెట్టిన చికెన్‌, దోశలు, వడలు లాగించాడు. ఆ తర్వాత అరిశెలు, లడ్లు, కారప్పూస తిన్నాడు. ఆ తర్వాత బయటకొచ్చి ఇతర పిల్లకాయలతో కలిసి వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడుకున్నాడు. గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడించాడు. సైకిల్‌ తొక్కుకుంటూ కసుమూరు, చవటపాళెం వెళ్లొచ్చాడు. సాయంత్రంగా మళ్ళీ ట్రస్ట్‌ వద్దకు వచ్చి... అమ్మా, మన బాలయ్యబాబు సినిమా 'జై సింహా' సూపర్‌గా వుందంట... నెల్లూరుకు సినిమాకు పోదామమ్మా అని అడిగాడు. అందుకు దీపా... నాకు సినిమా చూసేంత ఆనందం లేదులే బాబూ అని చెప్పింది. వెంకయ్య కోసం జరుగుతున్న సెర్చింగ్‌లో భాగంగా ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, హైటెక్‌రత్న, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు అందరూ వచ్చారు. వెంకయ్య కనిపించకపోవడంతో అందరిలోనూ టెన్షన్‌. అప్పుడే కళ్లకు నల్లద్దాలు పెట్టి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) అక్కడకు వచ్చాడు. మోడీ వుండి వివేకాతో... వెంకయ్య ఎక్కడకు వెళ్ళి వుంటాడు వివేకా అని అడిగాడు. దానికి వివేకా... ఆయన ఎక్కడకీ పోడు... ఇక్కడే వుంటాడు. ఆయనను ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు. నేనేం చేసినా మీరు కామ్‌గా వుండండి అంటూ రెండు కిళ్లీలు నోట్లో వేసుకుని బాగా నమిలి అక్కడే క్లీన్‌గా వున్న గోడమీద ఉమ్మేసాడు. అంతే అది చూసిన దీపా వెంకట్‌ను సిని మాకు పోదామని బ్రతిమలాడుతున్న కుర్రాడు పరుగెత్తుకుంటూ... ఏయ్‌ వివేకా బుద్దుందా... మన ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్‌ అని పదేపదే మొత్తుకుంటుంటే, నువ్విలా గోడలను ఖరాబ్‌ చేస్తావా... అంటూ మండిపడసాగాడు. అప్పుడు వివేకా నవ్వుతూ ఆ కుర్రాడి తల పట్టుకున్నాడు. అతని తల మీద వున్న విగ్గు ఊడి చేతికొచ్చింది. విగ్గు తీసి చూస్తే అతనే వెంకయ్యనాయుడు. అందరూ షాక్‌ తిన్నారు. ఎందుకిలా చేసారు నాన్నా అని దీప అడిగింది. సంక్రాంతి పండు గను చిన్నతనంలో ఎంజాయ్‌ చేసానమ్మా... మళ్ళీ అలాంటి ఆనందం కావాలనిపిం చింది. అందుకే ఈ పండుగరోజుల్లో ఎవర్నీ ఇక్కడికి రావద్దని చెప్పింది అని తన కోసం ఆదుర్దా చెందిన అందరికీ థ్యాంక్స్‌తో పాటు సారీ చెప్పాడు వెంకయ్య.

chandruluజిల్లాలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెల కొనడం తెలిసిందే! జిల్లాలో ఎక్కడా పూర్తి స్థాయిలో చెరువులు నిండిన దాఖలాలు లేవు. ఈ దశలో ఎగువ జిల్లాల్లో కురిసిన వర్షాల మూలంగా సోమశిలకు 50 టిఎంసీలకు పైగా నీళ్ళు రావడం తెలిసిందే! వర్షాభావ పరిస్థితుల వల్ల గత ఏడాది జిల్లాలో రెండో పంట లేకుండాపోయింది. ఈసారి పంటకైనా నీళ్ళుంటాయా లేదా అని సందేహిస్తున్న పరిస్థితుల్లో సోమశిలకు నీళ్ళు రావడం, సోమశిల, కండ్లేరు ఆయకట్టు క్రింద రైతులు ఆనందంగా పంటలు వేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఐఏబి సమావేశంలోనూ 5లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.

అయితే అధికారికంగా 5లక్షల ఎకరాలకే అని చెప్పినా అనధికారికంగా మరో రెండు లక్షల ఎకరాల వరకు రైతులు నీళ్ళను వాడుకుంటుంటారు. సోమశిల, కండ్లేరులలో నీటిని సాగునీటి అవసరాలకే కాకుండా చెన్నై, తిరుపతిలకు పంపించాలి. జిల్లాలో తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. డెడ్‌స్టోరేజ్‌లో కొంత పెట్టాలి. పైర్లు కోత కొచ్చే దశలో నీళ్ళు లేకపోతే చేతికొచ్చే పంటను కోల్పోయే పరిస్థితి... ఈ పరిస్థితిని వూహించే జిల్లా మంత్రి, వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇటీవల జన్మభూమి పర్యటనకు కోడూరుపాడు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాడు. ఆయన సానుకూలంగా స్పందించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద నుండి సోమశిలకు 5.5టీఎంసీల నీటి విడుదలకు సీఎం ఆదేశించాడు. సోమిరెడ్డి కృషితో ఈ పంటను గట్టెక్కించినట్లే!

Page 1 of 975

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
  నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…

Newsletter