Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 28

1Ariesమేషం

ఆర్ధికంగా బాగుండినా స్థిమితంగా ఉండలేరు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికం కాగలవు. వస్తు వాహన రిపేర్లు ఖర్చులు, బిడ్డల కుటుంబసభ్యుల అనారోగ్య బాధ లుంటాయి. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. బిడ్డల విద్యా వివాహ విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.

 

2Taurusవృషభం

ఇంటా బయట పనులందు శ్రమ ఉంటుంది. కాని చేపట్టిన పనులను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండి ఆదాయం పెరుగు తుంది. పబ్లిక్‌లో మంచి పేరుప్రతిష్టలు పొందుతారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

 

3Geminiమిధునం

కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాల ప్రయత్నాలు జరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయినా అవసరాలకు కొద్ది ఋణాలు చేయక తప్పదు. అనుకున్న పనులను శ్రమపడి సాధిస్తారు. విలువైన వస్తువులు సమకూరగలవు. శుభ కార్యాలు నిర్ణయం కావడం, బిడ్డల ఉన్నత విద్యపై శ్రద్ధ చూపడం జరుగుతుంది.

 

4Cancerకర్కాటకం

కొత్త వ్యాపారాలకు, సంస్థలలో పెట్టుబడులకు అవకాశములు దొరుకుతాయి. పట్టుదలతో అనుకున్న పనులు జరుపుకొంటారు. వ్యవహారాలలో సహచరులకు, మిత్రులకు మధ్య విభేదాలు రావచ్చు. ఖర్చులుండినా ఆర్ధికంగా ఇబ్బంది పడరు. బాధ్యతలు, వ్యాపకాలు పెంచుకుంటారు. ఆరోగ్యం ఫరవాలేదు. శుభకార్యాలలో దైవకార్యాలలో పాల్గొంటారు.

 

5Leoసింహం

ముఖ్యవిషయాలపై నిర్ణయాలు తీసికొనలేక టెన్షన్‌ పడతారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కాగలవు. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు లేకున్నా, ఆర్ధికంగా బాగుండి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సాంకేతిక న్యాయ వైద్య రంగాల వారికి ఆర్ధికావకాశాలు బాగుంటాయి.

 

6Virgoకన్య

ఉద్యోగములలో గాని, ఇతర కార్యక్రమాలలో గాని నిర్వహణ సామర్ధ్యం బాగుంటుంది. చేతి డబ్బులు ఇతరుల పనులకు గాను ఖర్చుపెట్టవలసి రావచ్చును. వృత్తి వ్యాపారాలు సామాన్య ఆదాయాన్నిస్తాయి. శుభ కార్యాలలో ఆత్మీయులను కలుస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

 

7Libraతుల

ఆర్ధిక ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు అధికంగా ఉంటాయి. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. వాహనాలు నడిపే వారు, మిషన్లు కరెంటు పనుల వారు జాగ్రత్తగా ఉండాలి. గృహ మార్పులు, స్థానమార్పులుండ గలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు పోవద్దు. పిల్లల వల్ల ఖర్చులు ఉంటాయి. ఇబ్బందులుండినా ధైర్యంగానే ఉంటారు.

 

8Scorpioవృశ్చికం

అవసరాలకు డబ్బు సమకూర్చుకొంటారు. వృత్తి వ్యాపారాలలో కొత్త విస్తరణ, ప్రయత్నాలు జరగక పోయినా, ఆదాయం లోపం కలుగదు. ఉద్యోగ నిర్వహణలో సమర్ధులుగా గుర్తింపు ఉంటుంది. కొత్త పదవులు, పరిచయాలు పెరుగుతాయి. బంధువర్గం నుండి అనారోగ్య విషయవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దూరప్రయాణాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

వృత్తి జీవనం కలవారికి మంచి అవకాశాలు దొర కడం, వ్యాపారవర్గాలకు ఆదాయం బాగుండుట, పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాలు పొందడం జరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా, సవ్యంగానే జరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సహ కారం బాగుంటుంది. బిడ్డల అనారోగ్య బాధలు, ఉన్నత విద్యపై అనిశ్చితి ఉంటుంది.

 

10Capricornమకరం

వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. కొత్త పెట్టు బడులకు కొత్త వ్యాపారాలకు అవకాశాలుంటాయి. ఆస్థి క్రయవిక్రయాలు మరియు వ్యాపారాల అగ్రిమెంట్లు జరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి కొంత అందు తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు సమకూర్చుకొనడం, శుభకార్యములను నిర్వహించడం, దూరప్రయాణాలుండగలవు.

 

11Aquariusకుంభం

ఆర్ధికావకాశాలు కలిసివస్తాయి. అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. బిడ్డల విద్యా ఉద్యోగ విషయాలలో అనుకూలత, శుభకార్యాలు నిర్ణయం కావడం, ఇంట బయట వ్యవహారాలలో చర్చలు జరపడం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలు అభివృద్ధి కరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు సమకూరుతాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఆర్ధికముగా బలపడి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది. తొందరపాటు ప్రవర్తన, మాటలు అదుపులో పెట్టుకొనాలి. బిడ్డలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధుమిత్రులను, ప్రముఖు లను కలుసుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత ఉంటుంది.

galpikaఅది ప్రపంచంలోని మేటి నగరాల న్నింటిని కాసి వడబోసి కట్టిన అమరావతి రాజధాని నగరం. నారా లోకేష్‌ పంచా యితీరాజ్‌, ఐ.టి శాఖ మంత్రిగా తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అనం తరం అక్కడే వున్న విలేకరులతో మాట్లా డుతూ రాష్ట్రంలో అన్ని పంచాయితీలకు కొత్త భవనాలు కట్టించి పంచాయితీరాజ్‌ మంత్రిగా సత్తా చూపిస్తాను... అట్లాగే రాష్ట్రంలో ప్రజలందరి చేత అఖరకు అడుక్కునేవాళ్ళ చేత కూడా ఆదాయపన్ను కట్టించి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచు తానని చెప్పాడు. అప్పుడు 'ఆత్మసాక్షి' రిపోర్టర్‌ వుండి... సార్‌, పంచాయితీ రాజ్‌ మంత్రిగా పంచాయితీలకు కొత్త బిల్డింగ్‌లు కట్టిస్తామన్నారు సరే, ఆదాయ పన్నుకు మీకు సంబంధమేంటని అడి గాడు. వెంటనే లోకేష్‌... ఐటి శాఖ అంటే ఇన్‌కంటాక్స్‌ శాఖే కదా అని సమా ధానమిచ్చాడు. ఆ జవాబుకు అక్కడున్న వారందరి కళ్లు బైర్లుకమ్మాయి. వెంటనే ఏబిసిడి రిపోర్టర్‌ వుండి... సార్‌, ఐటి అంటే ఆదాయపన్నుశాఖ కాదు, ఇన్‌ఫర్మే షన్‌ టెక్నాలజీ శాఖ అని అర్ధం అని చెప్పాడు. లోకేష్‌ సెల్‌ తీసి తన తండ్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసాడు. అవతల చంద్రబాబు ఫోన్‌ ఎత్తగానే... నాన్నారు ఐ.టి శాఖ అంటే ఏంటి అని అడిగాడు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అని చంద్రబాబు చెప్పాడు. ఆ ముక్క నాకు మంత్రి పదవి ఇచ్చేముందు చెప్పాలి, మీరు ఐటి శాఖ ఇచ్చారంటే ఇన్‌కంటాక్స్‌ శాఖ ఇచ్చారను కున్నా, దాని గురించే మీడియా ముందు మాట్లాడి ఫూల్‌నయ్యా, పోండి నాన్నగారు, మీరెప్పుడూ ఇలానే చేస్తారు అని లోకేష్‌ విసురుగా ఫోన్‌పెట్టేసాడు. మీడియా వాళ్ళు వెళ్లిపోయాక లోకేష్‌ పి.ఎస్‌ కొన్ని ఫైళ్లను తీసుకుని లోపలకు వచ్చాడు. పెద్ద ఫైళ్ల కట్టే ఉండడంతో లోకేష్‌ వాటిని చూసి... నాకిప్పుడు మూడేం బాగాలేదు, వాటిని అక్కడపెట్టండి, మూడ్‌ వచ్చాక అన్ని ఫైళ్లను చదివి సంతకం పెడతా నన్నాడు. అందుకు పి.ఎస్‌... మీరేం వాటిని అంత కష్టపడి చదవబల్లేదు సార్‌, నాన్నగారే అన్నీ చదివి పంపించారు. జస్ట్‌ మీరు వాటి మీద సంతకాలు పెడితే చాలు అని చెప్పాడు. ఆ మాటకు లోకేష్‌ విసురుగా ఇక్కడ కూర్చుని ఇక నేనేం చేయాలి అని అడిగాడు. గంటకొకసారి బూస్ట్‌, లంచ్‌కు రెండు పుల్కాలు ఇవ్వ మన్నారు సార్‌. మీరు బూస్ట్‌ తాగి ఆ రెండు పుల్కాలు తింటే చాలని చెప్పాడు పి.ఎస్‌. ఆ మాటతో లోకేష్‌కు చిర్రెత్తు కొచ్చింది. షిట్‌... అంటూ కాలితో ఫ్లోర్‌ను గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకు ఆ ఛాం బర్‌లో ఎంతో నాణ్యతగా వేసిన రెండు టైల్స్‌ పగిలిపోయాయి.

్య్య్య్య్య

విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఆరోజు హైటెక్‌రత్న, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రు లందరూ చంద్రబాబును వీరుడు, ధీరుడు, కత్తిపట్టని విక్రమార్కుడు అంటూ తెగ పొగిడారు. అందరూ మాట్లాడాక లోకేష్‌ వంతు వచ్చింది. ఆయన లేచి మైక్‌ వద్దకు పోగానే పి.ఎస్‌ ఒక పేపర్‌ తెచ్చిచ్చాడు. ఏమిటిదని లోకేష్‌ అడిగాడు. స్క్రిప్ట్‌ సార్‌, నాన్నగారు రాసిచ్చారు అని పి.ఎస్‌ చెప్పాడు. అందుకు లోకేష్‌ సీరియస్‌గా... మేమూ చదువుకున్నామండి, మేమూ సొంతంగా మాట్లాడగలం. మా స్క్రిప్ట్‌లు మాకుంటాయి. చెప్పండి మీ సీఎం గారికి అని అన్నాడు. అందుకు పి.ఎస్‌, బికాంలో ఫిజిక్స్‌ చదివిన జలీల్‌ఖాన్‌ గారిని మీరు ఫాలో అవుతున్నారని నాన్నగారు భయ పడుతున్నారు. మొన్న అంబేద్కర్‌ జయంతి నాడు అందరికీ వర్ధంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ కూడా అది రిపీట్‌ అవుతుందేమోనని నాన్నగారి భయం అని చెప్పాడు. నేను అంత శుద్ధ పప్పును కాను... మొన్నంటే తెలియక నోరు జారాను... ఇప్పుడు నాకు బాగా తెలి సింది. బర్త్‌డేను జయంతి, డెత్‌డేను వర్ధంతి అంటారు అని లోకేష్‌ చెప్పాడు. దానికి పి.ఎస్‌... మీరక్కడే పప్పులో కాలే స్తున్నారు, చనిపోయినవ్యక్తుల విషయం లోనే బర్త్‌డేను జయంతి, డెత్‌డేను వర్ధంతి అంటారు. ఇప్పుడు జీవించివున్న మనుషుల విషయంలో అయితే బర్త్‌డేను జన్మదినోత్సవం అంటారు. ఎందుకొచ్చిన రిస్క్‌ సార్‌, మళ్ళీ ఆ సోషల్‌ మీడియా వాళ్లకు పని పెట్టడమెందుకు, శుభ్రంగా నాన్నగారిచ్చిన స్క్రిప్ట్‌ చదివేసేయండి సార్‌ అని చేతిలో పెట్టాడు. లోకేష్‌ ఆ స్క్రిప్ట్‌ చదివేసి మౌనంగా దిగిపోయాడు. లోకేష్‌ను చూసి అక్కడున్న మంత్రులు, నాయకులు కూడా తండ్రి చాటు బిడ్డ, ఇప్పటికీ అన్నీ తండ్రి చెబితేనే చేస్తుంటా డని అనుకోసాగారు. ఆ మాటలు లోకేష్‌ చెవిన పడ్డాయి.

------------

అది చంద్రబాబు ఇల్లు. లోకేష్‌, నారా బ్రాహ్మిణితో క్యారమ్స్‌ ఆడుతుంటే భువనేశ్వరీదేవి దేవాన్ష్‌ను ఒడిలో కూర్చో బెట్టుకుని వారి ఆటను చూస్తుంది. లోకేష్‌ అప్పటికి నాలుగు వైట్‌, ఐదు బ్లాక్‌ కాయిన్స్‌ వేసి అప్పుడే రెడ్‌కాయిన్‌ను కూడా వేసాడు. ఫాలో కాయిన్‌ వేస్తే రెడ్‌ కాయిన్‌ సొంతమవుతుంది. లోకేష్‌ ఒక వైట్‌ కాయిన్‌కు స్ట్రైగర్‌కు గురిపెట్టి కొట్టబో తుండగా చంద్రబాబు వచ్చాడు. ఠక్కున లోకేష్‌ చేయి పట్టుకుని ఆ కాయిన్‌ను ఇలా కొడితే ఎలా పడుద్దనుకున్నావ్‌... గురి చూసి రిఫ్‌లో ఈ బ్లాక్‌ కాయిన్‌ను కొట్టు అని చెప్పాడు. లోకేష్‌ ఇక కాదనలేక అలాగే చేసాడు. బ్లాక్‌ కాయిన్‌ పడలేదు గాని స్ట్రైగర్‌ పోయి బొక్కలో పడింది. లోకేష్‌ ఇంకో ఎగస్ట్రా కాయిన్‌ పెట్టాల్సి వచ్చింది. బ్రాహ్మణి తర్వాత మళ్ళీ స్ట్రైగర్‌ లోకేష్‌కు వచ్చింది. లోకేష్‌ రెడ్‌కాయిన్‌కు స్ట్రైగర్‌ను గురిపెట్టి కొట్టబోతుండగా, చంద్రబాబు... రేయ్‌, లోకేష్‌ అలా కొడితే ఎలా పడుతుందనుకున్నావ్‌, ఇటు డైరక్షన్‌ మార్చు అని చెప్పాడు. అపండి నాన్నగారు అంటూ లోకేష్‌ పెద్దగా అరిచాడు. ఏమైం దిరా అని చంద్రబాబు ఆతృతగా అడి గాడు. ఆ పరిణామానికి భువనేశ్వరి కూడా నిర్ఘాంతపోయింది. లోకేష్‌ వుండి... ఇంతకంటే ఏం కావాలి నాన్నగారు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు, నా పని కూడా మీరే చేస్తుంటే ఇక నా పని నేనెప్పుడు చేసుకోవాలని నాన్నగారు... మంత్రిని చేసారు, కాని ఫైల్స్‌ మీరే చూస్తారు, స్టేజీల మీదకు పంపిస్తారు, స్క్రిప్ట్‌ మాత్రం మీరే ఇస్తారు. ఇక నా స్క్రిప్ట్‌ నేనెప్పుడు చదవాలి నాన్న గారు. మిమ్మల్ని గెలిపించడం కోసం ప్రతి క్షణం నేను ఓడిపోతున్నాను నాన్నగారు. నాకు కావాల్సిన డ్రాయర్లు మీరే కొం టారు, నాకు హార్లిక్స్‌ ఇష్టమైతే మీరు బూస్ట్‌ ఇస్తారు, నాకు చపాతీలు తినాలనిపిస్తే మీరు పుల్కాలు పెట్టిస్తారు. నాకు ఏరో బిక్స్‌ ఇష్టం... మీరేమో యోగా చేయి స్తారు. ఆఖరకు నేను అంతంత మాత్రంగా ఆడే క్యారమ్స్‌లో కూడా వేలుపెట్టి ఆ ఆటలో కూడా నన్ను చేతగాని వాడిగా చేస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు నాన్న గారు. ఆ సోషల్‌ మీడియాలో అయితే నన్ను శుద్ధపప్పు అంటూ పోస్టింగ్‌లు పెడుతున్నారు అని బాధగా అన్నాడు. అందుకు చంద్రబాబు... వాళ్ళు పోస్టింగ్‌లు పెడితే నాదా తప్పు... నేనేం చేసానురా అని అడిగాడు. అంతా మీరే చేసారు నాన్నగారు... చేయాల్సిందంతా మీరే చేసారు... అని లోకేష్‌ అన్నాడు. ఆ మాటకు చంద్రబాబుతో పాటు భువ నేశ్వరిదేవి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లు కూడా నిర్ఘాంత పోయారు. అవేం మాటలు లోకేష్‌... నాన్నగారు ఏం చేసారని భువ నేశ్వరీదేవి అడిగింది. అందుకు లోకేష్‌... అంతా నాన్నగారే చేసారమ్మా... ఈ రాష్ట్రానికి సెల్‌ఫోన్‌లు ఆయనే తెచ్చారు, ఐ.టి కంపెనీలను ఆయనే తీసుకొచ్చారు, అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌లు ఉం డేలా చేసారు. అందరూ వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లు వాడేలా డెవలప్‌ చేసారు. ఆయన తెచ్చిన ఫోన్‌లు, ఆయన తెచ్చిన సాఫ్ట్‌వేర్‌ల మూలంగానే ఈ రోజు సోషల్‌ మీడియా డెవలప్‌ అయ్యి అందులో అందరూ నన్ను 'పప్పు' అని ఆడుకుంటున్నారమ్మా... ఆయన అసలు సెల్‌ఫోన్లే తేకుంటే నాకీ పరిస్థితి ఉండేది కాదుకదా అని ప్రశ్నిం చాడు. ఆ మాటకు భూవనేశ్వరీదేవి... నిజమే కదా అన్నట్లు చంద్రబాబు వైపు చూసింది. లోకేష్‌ లాజిక్‌కు ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు పైన తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌కేసి చూడసాగాడు.

mavoచత్తీస్‌ఘడ్‌.. మావోస్‌ఘడ్‌గా మారిపోయింది. మావోయిస్ట్‌లకు అది కంచుకోటగా తయారైంది. ఎక్కడ మాటు వేసి వుంటారో తెలియదు..ఒక్కసారిగా రక్తపాతం సృష్టించడమే వారి పని. వందలాదిగా విరుచుకుపడి జవాన్లను..పోలీసులను నిర్ధాక్షిణ్యంగా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న రాక్షసమూక అది. అసలే దండకారణ్యం..మావోయిస్టుల రాక్షసక్రీడలకు నిలయంగా మారింది. విధి నిర్వహణకు ఎక్కడెక్కడినుంచో వచ్చి, తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అమాయక జవాన్లు..పోలీసులు వారి టార్గెట్‌గా మారడం ఎంతైనా దారుణం. చత్తీస్‌ఘడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులందరినీ ఏరిపారేశామని పోలీసులు భావిస్తున్న సమయంలో, దాదాపు నాలుగు వందలమందిదాకా మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడి సిఆర్‌పిఎఫ్‌ (కేంద్ర రిజర్వ్‌ పోలీసుదళం)కి చెందిన 25మంది జవాన్లను పొట్టనబెట్టు కున్నారంటే ఈ ప్రాంతంలో మావోయిస్ట్‌లు ఎంతగా చెలరేగిపోతున్నారో విశదమవుతోంది. ఇంతమంది జవాన్లను సైతం లెక్కచేయకుండా వారిపై తుపాకులు ఎక్కుపెట్టారంటే మావోయిస్ట్‌లు ఎంతగా బరితెగించి పోతున్నారో అర్ధమవుతోంది. అంతమంది జవాన్లపై హటాత్తుగా దాడిచేసి మావోయిస్టులు తమ పైశాచి కత్వాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. జవాన్లు తేరుకునేలోపే దుండగులు ఏకధాటిగా గుళ్ళ వర్షం కురిపించారు. జవాన్లు కొందరు మావోయిస్ట్‌లపై ఎదురుదాడి చేసేలోగానే.. అనేకమంది జవాన్లు నేలకొరిగిపోయారు. మాటువేసి..జవాన్లపై దొంగదెబ్బ తీసిన మావోయిస్ట్‌లు జవాన్ల మృతదేహాల వద్ద వున్న ఆయుధాలను కూడా ఎత్తుకుపోయారు. ఈ అమానుష దాడిలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల బృందానికి కమాండర్‌గా వున్న రఘువీర్‌సింగ్‌ కూడా ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటనలో ఏడు గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అనేకమంది జవాన్ల పరిస్థితి విషమంగానే వుంది. మరో 8 మంది జవాన్ల ఆచూకీ కూడా దొరకడం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో మల్కాన్‌గిరి జిల్లాలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో (ఏఓబి) జరిగిన భారీఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా మావోయిస్టులు ఈ ప్రతీకార దాడికి పాల్పడివుండవచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు పనులకు రక్షణగా వున్న జవాన్లందరినీ వందలాదిమంది మావోయిస్ట్‌లు ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులకు తెగబడడమే కాక, దారిపొడుగునా మందుపాతర్లు పేల్చి ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టించారు. సిఆర్‌పిఎఫ్‌ 74వ బెటాలియన్‌కు చెందిన 150 మంది జవాన్లు దక్షిణ బస్తర్‌లోని కాలాపత్తర్‌ ప్రాంతంలో నిర్మాణంలో వున్న రహదారి వద్ద గస్తీగా వుండి.. భద్రతావిధులు నిర్వర్తించి వస్తుండగా, ముందుగానే వ్యూహం పన్నిన మావోయిస్టులు ఆ రహదారి వద్ద పొంచివుండి.. ఒక్కసారిగా జవాన్లపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు. పోలీసులు, ఇంటెలిజన్స్‌ వర్గాలు అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇంత దారుణం జరిగివుంటుందని సర్వత్రా భావిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల బలాన్ని సక్రమంగా అంచనా వేయలేకపోవడం, నిఘావర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండకపోవడం వంటి వైఫల్యాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే వున్నాయి. చింతగుహ నుంచి బురకాపాల్‌ వరకు వున్న ఆ రహదారి నిర్మాణానికి నక్సలైట్లు ఆటంకం కలిగిస్తారేమోనని భావించి కేంద్రం పెద్దఎత్తున పోలీసు బలగాలను అక్కడికి పంపినప్పుడు, ఆ ప్రాంతంలో జవాన్లకు రక్షణగా పటిష్టమైన నిఘా వ్యవస్థ లేక పోవడం లోపమేననుకోవచ్చు. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం, వందలాదిమంది మావోయిస్ట్‌లు తరలివచ్చి ఇంత భయంకరమైన విధ్వంసం సృష్టిస్తున్నా...కనీస సమాచారం లేక..ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా లేకపోవడం...వంటివన్నీ నిఘావర్గాలు లేదా పోలీసువర్గాల వైఫల్యమే నని భావించవచ్చు. నక్సల్స్‌ బలం తగ్గిపోయిందనుకున్న పోలీసుల అతివిశ్వాసమే ఇప్పుడు కొంపముంచింది. ప్రతీకారం కోసం కాచుకునివున్న మావోయిస్ట్‌లు ఇదే అదనుగా ఈ మారణకాండకు తెగబడినట్లు స్పష్టమవుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో కేంద్రప్రభుత్వం ఇక్కడ రహదారులు నిర్మిస్తుంటే సహించలేక మావోయిస్టులు ఇలాంటి పైశాచికదాడులకు పాల్పడడం.. అమాయక జవాన్లను సైతం పొట్టనపెట్టుకోవడం దారుణం. రక్షణగా వచ్చినవారికే రక్షణ లేకపోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలపై, మావోయిస్టుల అకృత్యాలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాల్సి వుంది. ఇప్పుడే కాదు..గతంలో కూడా మావోయిస్ట్‌లు ఇలాంటి బీభత్సాలకు పాల్పడివున్నారు.

అయినా ఈ దారుణాలు..హింసాత్మక ఘటనలు ఇంకా ఎంతకాలం?...నేటి ఆధునికయుగంలో అత్యంత అద్భుతమైన సాంకేతిక విజ్ఞానంతో ప్రపంచ మంతా వూహించనంత వేగంతో ప్రగతిదారుల్లో పయనిస్తుంటే, కమ్యూనిస్టుదేశాల్లో సైతం ఆర్ధిక సంస్కరణలు వెల్లువెత్తుతూ పెట్టుబడిదారీ సంస్కృతి సర్వత్రా వెల్లివిరుస్తుంటే.. ప్రగతిలో అమెరికాతో సైతం కమ్యూనిస్ట్‌ చైనా పోటీపడి ముందుకు సాగుతుంటే... మావోయిస్ట్‌లు ఇంకా పిడివాదంతో అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరుగుతుండడం... ఇలాంటి దారుణ మారణకాండలకు, హింసాత్మకచర్యలకు పాల్పడుతుండడం ఏమిటో.. చివరికి వారు సాధించగలిగేదేమిటో.. వారికే తెలియాలి.

ఎవరైనా సరే, హింసతో సాధించగలిగేదేమీ వుండదన్న వాస్తవాన్ని గుర్తించాలి. శాంతియుత విధానాలతో జీవిస్తూ.. సమస్యలేమైనా వుంటే చర్చించి వాటి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తూ, తద్వారా సమాజాభ్యు న్నతికి పాటుపడాలే తప్ప..అన్ని సమస్యలకీ హింసే పరిష్కారమార్గం అనుకోవడం.. హింసాత్మక మార్గాలను అనుసరించడం మూర్ఖత్వమే. అందులోనూ ప్రజలకు రక్షణగా నిలిచే జవాన్లు, పోలీసులపై ఇలాంటి హింసాకాండలకు పాల్పడడం.. భీభత్సాలు.. రక్తపాతాలు సృష్టించడం పైశాచికత్వమే తప్ప మరొకటి కాదు. అది ఏనాటికీ మానవత్వమనిపించుకోదు.

Page 1 of 820

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter