Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 25

1Ariesమేషం

చేయదలచుకున్న పనులు సమర్ధవంతంగా చేస్తారు. పెండింగ్‌లో పడిన పనులు మరలా ప్రారంభం కాగలవు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుని ఆర్ధికంగా స్థిమితం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిర్మాణాలు కొన సాగుతాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. రావలసిన బాకీలపై వత్తిడి పెంచుతారు. బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలుంటాయి.

 

2Taurusవృషభం

వృత్తి వ్యాపారాలు లాభాలను సమకూరుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ముఖ్య పత్రాలు అందుకుంటారు. పన్నుల చెల్లింపులు జరుగుతాయి. దూరప్రయాణాలుంటాయి. కుటుంబవ్యక్తుల సమస్యలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడు తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. కొత్త కాంట్రాక్టులు, ఏజెన్సీలు లభించగలవు.

 

3Geminiమిధునం

ఆర్ధికపరంగా చిక్కులుంటాయి. అయితే డబ్బుకు అంతగా ఇబ్బంది ఉండదు. పెండింగ్‌లో సమస్య పోయి మీకు అనుకూలత బాగుంటుంది. వ్యాపారవర్గాలకు ఆశించిన అభివృద్ధి ఉండదు. ఆదాయం సామాన్యం. వృత్తి జీవనం కలవారికి రాబడి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా వేయండి. విమర్శలను లెక్కచేయకండి.

 

4Cancerకర్కాటకం

తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనండి. స్థిరాస్తులపై ఆదాయముంటుంది. వృత్తి వ్యాపార విషయంలో అభివృద్ధి, ఆదాయము బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను, ప్రజలతోను జాగ్రత్తగా మెలగండి. అనుకున్న పనులు జరుగుతున్నా వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తప్పవు.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి అవకాశం బాగుంది. ఆదాయం సంతృప్తికరం. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. మాట హామీలు, రుణాలు ఇవ్వవద్దు. మిమ్మల్ని విమర్శించేవారుంటారు. కాబట్టి పొరపాట్లను సరిదిద్దుకొనండి. పెట్టుబడులకు అవకాశాలు, ఉద్యో గార్థులకు అవకాశాలు బాగుంటాయి. రావలసిన బాకీలు నిలబడిపోవచ్చును. ఆరోగ్యం బాగుంటుంది.

 

6Virgoకన్య

ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు రుణాలు లభిస్తాయి. బంధు ముఖ్యులకు అనారోగ్య వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలను బాగా వృద్ధి చేస్తారు. ఆదాయం బాగుం టుంది. బంధుమిత్రులు సహాయం అర్ధించవచ్చును. ముఖ్యమైన పత్రాలు, రావలసిన బాకీలు అందుతాయి. స్థిరాస్తుల లావాదేవీలు జరుగగలవు. ఉద్యోగావకాశాలు బాగుంటాయి. అనవసర విషయాలలో జోక్యం వద్దు.

 

7Libraతుల

ఆర్థిక వ్యవహారాలలో చిన్న ఇబ్బందులుంటాయి. అందుకని చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టండి. వ్యాపార వృద్ధి అవకాశాలు అందుబాటు కాకపోవచ్చును. సామాన్య, ఆదాయముంటుంది. చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. స్థిరాస్తులపై కొంత రాబడి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం, వత్తిడి ఉంటుంది. ఉద్యోగార్థులు దీక్షతో ప్రయత్నాలు చేయండి.

 

8Scorpioవృశ్చికం

ఏదో ఒకరూపంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తిజీవన సంపాదన బాగుంటుంది. వ్యాపారవర్గాలు అభివృద్ధికై శ్రమపడాలి. ఆదాయం సామాన్యం. వ్యాపకం పెరిగి అనేకపనులతో ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం తగ్గి విభేదాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. ప్రముఖు లను ఆత్మీయులను కలుసుకుంటారు.

 

9Sagittariusధనుస్సు

చిన్న వృత్తులు, వ్యాపారాలు జరుపుకునేవారికి ఆదాయం బాగుంటుంది. ఇతరులను బాధపెట్టే మాటలు, పనులకు పూనుకొనవద్దు. విలువైన వస్తువులు, కాగితాలు జాగ్రత్త. ప్రభుత్వపరంగా పనులు, అంద వలసిన ఆదాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరిగి, ఆదాయానికి తగిన ఖర్చులుం టాయి. చేపట్టిన పనులకు మధ్య ఆటంకాలుంటాయి.

 

10Capricornమకరం

ప్రవర్తన, మాటలలో దుడుకుతనం తగ్గించుకొనాలి. చేస్తున్న మీ పనుల ప్రయత్నాలు వత్తిడితో జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆదాయం పెరగడం ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో సఖ్యతగా ఉం టారు. స్థిరాస్తుల లావాదేవీలకు అవకాశాలుంటాయి. ఉద్యోగార్థులకు అవకాశాలు లభించగలవు. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

11Aquariusకుంభం

లౌకిక వ్యవహారాలను, ఇంటి వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఆర్ధికస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం బాగుం టుంది. అయినా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పారిశ్రామిక, కాం ట్రాక్ట్‌ రంగాల వారికి ప్రోత్సాహం, అవకాశాలు బాగుం టాయి. షేర్లలో లాభాలు ఉంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులు వేగవంతంగా సాగుతాయి. కొత్త పెట్టుబడులకు, వ్యాపారవృద్ధికి అవకాశాలు బాగుం టాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. బంధువర్గాన్ని కలుసుకుంటారు. వస్తు లాభము, రావలసిన బాకీలు లభించుట, ప్రభుత్వ కార్యాలయాలందు పనులు అను కూలమగును. విద్యార్థులకు మంచి విద్యావకాశాలు దొరుకుట, కుటుంబసౌఖ్యము బాగుండును.

galpikaపట్టువదలని విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌థర్టీకల్లా నిద్ర లేచాడు. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తన గది నుండి బయటపడ్డాడు. మూలాపేట సెంటర్‌లో బిర్యాని తిని మద్రాసుబస్టాండ్‌ వద్దకొచ్చి ఒక ఆటో ఎక్కి పెద్దాసుపత్రి వద్ద దిగాడు. పెద్దాసుపత్రిలోని మార్చురీ వద్దకు వెళ్ళి ఫ్రెష్‌గా వున్న బాడీని చూసుకుని భుజాన వేసుకుని జిఎన్‌టి రోడ్డు మీదుగా బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశానవాటిక వైపు నడవసాగాడు. టీటీడీ కళ్యాణ మండపం దాకా వెళ్ళేసరికి కాస్తున్న ఎండదెబ్బకు విక్రమార్కుడికి చెమటలు కారసాగాయి. ఇక లాభం లేదు... ఈ భేతాళుడు రాత్రి బాగా తాగి నిద్రపోతున్నట్లున్నాడు... ఇక నేను నడవ లేను... ఈ బాడీని ఆటోలో వేసుకుని పోదామనుకుని ఆటోను ఆపి బాడుగ మాట్లాడుతున్నంతలో బాడీలోని భేతాళుడికి మెలకువ వచ్చింది. వెంటనే అతను విక్రమార్కుడితో... రాజా, మనుషులు సైతం నడవడానికి భయపడే ఈ ఎండల్లో నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు జాలి, దయ రెండూ కంబైన్డ్‌గా కలుగు తున్నాయి. నీకు శ్రమ తెలియకుండా వుండేందుకు లేటెస్ట్‌ పొలిటికల్‌ స్టోరీ షార్ట్‌ ఎడిటింగ్‌లో చూపిస్తాను, అలా డిఆర్‌ బార్‌కు పోదాం పద అంటూ తీసు కెళ్ళాడు. బార్‌లో కూర్చున్నాక భేతాళుడు నాలుగు బీర్లు ఆర్డర్‌ చేసి కథ చెప్పడం మొదలుపెట్టాడు.

రాజా, ఇటీవలే కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక హంగ్‌ ఏర్పడింది. పెద్ద పార్టీగా ఏర్పడ్డ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్‌ ఆహ్వానించడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం చకచక జరిగిపోయాయి. బీజేపీ పూర్తి మెజార్టీకి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు ఆ 8 మందిని ఎలా గైనా కొనాలని బేరసారాలు మొదలు పెట్టారు. ఈలోపు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించుకుపోసాగాయి. కర్నాటకలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, రాజ్యాంగ విలువలను బీజేపీ కాల రాసిందని రాజ్యాంగ రక్షక బిరుదాం కితుడు, తనకు అవసరం లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ లను, 23మంది ఎమ్మెల్యేలను హోల్‌ సేల్‌గా కొని రాజ్యాంగ విలువలను తు.చ తప్పకుండా పాటించిన చంద్రబాబు నాయుడు భలే బాధపడ్డాడు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వున్న ఆ 3రోజులు ఆయన తిండి తినలేదు. కునుకూ తీయ లేదు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటారా అని ఆవేదన చెందాడు. ఎట్టకేలకు కొనుగోలు తంతు లేకపోవ డంతో ఊపిరిపీల్చుకుని ఇప్పుడు ప్రశాం తంగా కడుపుకు రెండు పుల్కాలు తింటు న్నాడు. కర్నాటక సంఘటనపై రాహుల్‌ గాంధీ కూడా భలే సీరియస్‌ అయ్యాడు. గతంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీసిన కాంగ్రెస్‌ పార్టీయే భారత ప్రజా స్వామ్యాన్ని రక్షించగలదని, బీజేపీ రాజ్యాంగ హననానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక తెలుగు మీడియా(పచ్చ) ఛానెల్స్‌ అయితే బీజేపీపై విరుచుకుపడ్డాయి. పచ్చ ఛానళ్ళ ప్రతి నిధులే ప్రత్యర్థులుగా మారి టీవీ చర్చా వేదికలలో బీజేపీ నాయకులను ఉతికి ఆరేసారు. ఈ పరిస్థితులు ఇలా వుండగా కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో మెజార్టీ వున్న తమను కాదని, గవర్నర్‌ బీజేపీని ఆహ్వా నించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను విచా రించిన సుప్రీంకోర్టు బల నిరూపణకు గవర్నర్‌ ఇచ్చిన రెండువారాల గడువును ఒక్కరోజుకు తగ్గించేసింది. గవర్నర్‌ 15 రోజుల గడువు ఇచ్చాడుగా... తాపీగా బేరసారాలు చేసి కనీసం 10మంది ఎమ్మెల్యేలనన్నా లాగొచ్చులే అనుకున్న బీజేపీ నాయకులకు సుప్రీం ఇచ్చిన గడువుతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంది. అప్పటికప్పుడు హడావిడి చేసినా ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనలేక పోయారు. సీన్‌ ముందే వూహించిన యడ్యూరప్ప బలనిరూపణకు పోకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏడుస్తూ వెళ్లిపోయాడు. యడ్యూరప్ప రాజీనామా చేయగానే ప్రజాస్వామ్యం బ్రతికి చీరకట్టిందని ప్రజాస్వామ్య పుత్రుడు చంద్రబాబు ప్రకటించాడు. ఇది రాజ్యాంగ విజయమంటూ రాహుల్‌ గాంధీ నొక్కివక్కాణించాడు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ భారీగా బాణాసంచా కాల్చి తన కార్యకర్తలకు బెంగాళీ స్వీట్స్‌ పంచింది. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆనందంతో చీపుర్లు పట్టుకుని రోడ్లు వూడ్చాడు.హైదరా బాద్‌లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పెద్ద దావత్‌ ఏర్పాటు చేశాడు. తీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ పీకల దాకా పచ్చిగడ్డి తిని పండగ చేసుకున్నాడు. బీజేపీ అధికారంలో వున్న మూడ్రోజులు తమతమ ఛానెల్స్‌లో ఏడుస్తూ వార్తలు చెప్పిన న్యూస్‌ రీడర్‌లు, యాంకర్‌ల ముఖాలలో బీజేపీ దిగి పోగానే ఆనందం వెల్లివిరిసింది. వారి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి... అని భేతాళుడు స్టోరీ ముగించి.. రాజా, కేంద్రంలో ప్రభుత్వాన్ని పెట్టుకుని కూడా బీజేపీవాళ్ళు కేవలం 8మంది ఎమ్మెల్యే లను ఎందుకు కొనుక్కోలేకపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినా తెలియకపోయినా సచ్చినట్లు చెప్పా ల్సిందే... చెప్పకపోయావో టీటీడీలో సీనియర్‌ అర్చకుడివై చంద్రబాబు ద్వారా మానసిక క్షోభకు గురవుతావని బెది రించాడు.

దానికి విక్రమార్కుడు, భేతాళ... ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం చంద్రబాబు నాయుడు... అని చెప్పాడు. అదెలా అని భేతాళుడు అడిగాడు. అందుకు విక్ర మార్కుడు... బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలోనూ, వారి చేత క్యాంపులు నిర్వహించడంలోనూ నిష్టా గరిష్టుడైన చంద్రబాబును దూరం చేసుకున్నారు. 1985లో నాదెండ్ల వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టిన అనుభవశాలి... 1995లో అదే ఎన్టీ ఆర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను చీల్చిన ధీశాలి... 2014 నుండి వైసిపికి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసిన అపర మేధావి... ఈ కష్టకాలంలో ఆయనే గనుక బీజేపీకి తోడుండుంటే 8మంది ఎమ్మెల్యేలేం ఖర్మ 80మంది ఎమ్మెల్యేలను ఈజీగా లాగే సుండేవాడు. యడ్యూరప్పకు సీఎం సీటును వదలాల్సిన పని వుండేది కాదు. చంద్రబాబును దూరం చేసుకోబట్టే కర్నాటకలో కుర్చీ కమలానికి దూర మైందని చెప్పాడు. ఈ సమాధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు ఇంకో రెండు బీర్లు చేతిలో పట్టుకుని డిఆర్‌ హోటల్‌ పైనే వున్న సెల్‌టవర్‌ ఎక్కేసాడు.

janaki baluనెల్లూరు గానాలపట్టి, భారతీయ సినిమా గర్వించదగ్గ గాయకుడు యస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సంబరం జూన్‌ 4న నెల్లూరు టౌన్‌హాల్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఆడి టోరియం నందు జరుగనుంది.

తన జన్మదినం సందర్భంగా ఆయన ప్రతియేటా ఇస్తున్న ''యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం'' మరియు లక్ష రూపాయల నగదు బహుమానం ఈ ఏడాది పాటల కోకిలమ్మ యస్‌.జానకికి ఇవ్వాలని నిర్ణయించి ఆమెను సంప్రదించినప్పుడు ఆమె అత్యంత సున్నితంగా తిరస్కరించారు. సన్మానాలు, సత్కా రాలు, పురస్కారాలకు తాను చాలా దూరంగా వుంటున్నానని, బాలు గారిపైనున్న అవ్యాజమైన ప్రేమాభిమానాలకు గుర్తుగా నెల్లూరుకు వచ్చి ఆ వేదికపై నుండి ఆత్మీయ ఆశీర్వచనం అందిస్తానని చెప్పారు. తనకివ్వదలచిన పురస్కారాన్ని ఏదైనా సమాజసేవా కార్యక్రమానికి వినియోగించమని ఆమె బాలు గారిని ఆదేశించారు. ఈ సందర్భంగా యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆమెను గౌరవించుకుంటారు, ఆమె ఆశీస్సులు అందుకుంటారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యస్‌.పి.బాలు మాట్లాడుతూ 1960-63ప్రాంతాల్లో తాను గూడూరు కాళిదాస కళానికేతన్‌ నిర్వహించిన పోటీల్లో పాటలు పాడానని, ఆ పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా విచ్చేసిన ప్రముఖ సినీగాయని ఎస్‌.జానకి మాట్లాడుతూ, తనను దగ్గరకు పిలిచి బాగా ప్రయ త్నిస్తే మంచి గాయకుడివవుతావని ఆశీర్వదించిందని తెలియ జేశారు. మాతృ సమానురాలైన జానకమ్మ ఆశీర్వచనఫలంతో తాను విఖ్యాత గాయకునిగా ఇంత ఉన్నతస్థాయికి ఎదిగానన్నారు. ఇదంతా ఆ చల్లనితల్లి దీవెన లేనని అన్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీపరిశ్రమలో పాటలు పాడుతూ మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకున్నానని చెప్పారు. జానకమ్మ ఆత్మీయ ఆశీర్వచనాన్ని స్వీకరించేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. 'నా పాటను అభిమానించి నన్ను గాయకునిగా అత్యున్నతస్థాయికి చేర్చడమే గొప్ప ఆశీస్సు'.. అని బాలూ ఈ సందర్భంగా జానకమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ కళా విమర్శకులు విఏకె రంగారావు, సినీసంగీత దర్శకుడు విద్యాసాగర్‌, సినీకవి భువనచంద్ర, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌, లాయర్‌ వారపత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఎం.డి వీరిశెట్టి హజరత్‌బాబు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.జానకి జీవిత చరిత్రపై లఘుచిత్రం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సాంస్కృ తిక కార్యక్రమాల్లో భాగంగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటి ఆఫ్‌ నాలెడ్జ్‌ & టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే నూజివీడు త్రిబుల్‌ ఐ.టిలో యోగా విభాగం నిర్వాహకులు సత్యశ్రీధర్‌ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులచే సంగీతంతో కలిపిన యోగా నృత్యరూప కాలను ప్రదర్శిస్తారన్నారు.

Page 1 of 1048

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter