Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 20

1Ariesమేషం

ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అభివృద్ధి, స్వల్పంగా ఆదాయవృద్ధి ఉంటుంది. కుటుంబంలో మీకు అనుకూలత తక్కువ. హామీలివ్వడం, ఋణాలివ్వడం చేయవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమావేశాలకు హాజరు కాగలరు. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి.

 

2Taurusవృషభం

ఖర్చులు ఎక్కువుగా వుంటాయి. మంచి వ్యాపార అవకాశాలు చేజారిపోవచ్చును. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఆవేదన కలిగిస్తాయి. వృత్తిపరంగా బాగుండి సంతృప్తికరంగా రాబడి ఉంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివచ్చి పనులు జరిగిపోతాయి. కోర్టు కేసులు వాయిదా పడగలవు. షేర్లు, పెట్టుబడుల మీద లాభాలుండగలవు. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

3Geminiమిధునం

అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. స్థిరా స్తుల లావాదేవీలు జరుపుతారు. పన్నుల చెల్లింపు జరుపు తారు. కొత్త వస్తువులు, విలువైన వస్తువులు సమకూరు తాయి. ప్రభుత్వ అనుమతులు పొందడం, పలుకుబడి వృద్ధి చెందడం జరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు, లీజులు లభించే అవకాశం కలదు.

 

4Cancerకర్కాటకం

ఆదాయానికి తగ్గట్టు అదనపు ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో పెరుగుదల ఉంటుంది. పనులు అనుకున్న విధంగా జరుగుతున్నా టెన్షన్‌గా వుంటుంది. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. కొత్త వస్తువులు సమకూరుతాయి. కొత్త పరిచయాలేర్పడి మీ అభివృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగులకు అధికార వర్గ సహకారం బాగుంటుంది. స్టాకిష్టులు ఇబ్బంది పడవచ్చును.

 

5Leoసింహం

అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా సాగు తాయి. వ్యాపార వ్యవసాయవర్గాలు అభివృద్ధికై కొత్త ప్రయత్నాలు చేస్తారు. వృత్తి జీవనం కలవారికి ఆర్ధికంగా బాగుంటుంది. వేడుకలందు పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలుంటాయి. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు అనుకూలత ఉన్నది.

 

6Virgoకన్య

చేసే పనులకు, ప్రయత్నాలకు పరిస్థితులు అను కూలిస్తాయి. వ్యాపారవృద్ధి ప్రయత్నాలు నెరవేరి ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవనం సంతృప్తికరం. శుభకార్యాలు నిర్ణయమగుటకు కృషి చేస్తారు. అధికారులకు ప్రమో షన్లు, స్థానమార్పులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించగలవు. కొత్త అగ్రిమెంట్లు జరగడం, కాం ట్రాక్టులు లభించడం జరుగుతుంది.

 

7Libraతుల

కుటుంబ వ్యవహారాలను సామరస్యంగా పరిష్క రించగలరు. వృత్తి వ్యాపారవృద్ధి కృషి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార పెట్టుబడి అవకాశాలు బాగుంటాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. బాకీలు రావలసినవి నిలబడిపోతాయి. అనవసర తగాదాలలో దిగవద్దు. ఉద్యోగులకు పని భారం ఎక్కువ. ఆరోగ్యం బాగుంటుంది.

 

8Scorpioవృశ్చికం

చేపట్టిన పనులందు ఆటంకాలుంటాయి. కుటుం బంలో విభేదాలు ఏర్పడవచ్చు, కాబట్టి జాగ్రత్తపడాలి. వ్యాపారవృద్ధి అవకాశాలు తప్పిపోవచ్చును. వృత్తి వ్యాపారములందు సామాన్య ఆదాయముంటుంది. బ్యాంకు ఋణాలు, ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. బయట వ్యవహారాలలో అపనిందలు పడవలసి రావచ్చును. అనుకోని అదనపు ఖర్చు ఉంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఆర్ధిక ఇబ్బందులు తొలగ గలవు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు జరిగి పనులు సానుకూలం కాగలవు. విలువైన వస్తు, వస్త్రాలు సమకూరుతాయి. గృహ నిర్మా ణాలు, కాంట్రాక్టు పనులు వేగంగా జరిగి ప్రభుత్వ నిధులను పొందగలరు. పన్నుల చెల్లింపు జరుపుతారు. శుభవార్త వింటారు. ఉద్యోగావకాశాలు కలవు.

 

10Capricornమకరం

కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయడం, పెట్టుబడు లకు అవకాశాలు దొరకడం ఉంటుంది. తలపెట్టిన పనులకు చిన్నచిన్న ఆటంకాలు కలగడం, టెన్షన్‌ పడటం జరుగుతుంది. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు విభే దించవచ్చు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగు తాయి. ఆదాయం సంతృప్తికరం. ముఖ్య వస్తువులను, పత్రాలను పదిలపరచుకొనాలి.

 

11Aquariusకుంభం

చేసే పనులపై శ్రద్ధ ఉండక మాటలు పడవలసి ఉంటుంది. పరిస్థితులను బట్టి సర్దుకొని పోవలసి ఉం టుంది. వ్యాపారవృద్ధికై చేసే ప్రయత్నాలలో అనుకూలత, సామాన్య ఆదాయం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల తోనూ, పబ్లిక్‌తోను జాగ్రత్తగా ఉండాలి. వివాద సమస్యలు సర్దుబాటు కాగలవు. వృత్తి జీవనం కలవారికి అభివృద్ధి, రాబడి బాగుంటుంది.

 

12Piscesమీనం

ఆర్ధిక ఇబ్బందులుండినా, అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు బాగుంటాయి. ప్రయత్నం చేయాలి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వ్యాపారవర్గాలకు కొంత నిరుత్సాహం తప్పదు. ఆదాయం సామాన్యం. కోర్టు కేసులు వాయిదాపడతాయి. చిన్న విషయాలపై బంధువర్గంతో విభేదాలు కలుగవచ్చును. పనులు మందకొడిగా సాగుతాయి.

anilనెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల కోసం ఈ నెల 26వ తేదీ నుండి ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈనెల 17వతేదీన నెల్లూరు లోని ఎం.సి.ఎస్‌ కళ్యాణ మండపంలో వైయస్సార్‌ కుటుంబం ముగింపు సభ మరియు నియోజకవర్గ వైసిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 21వ తేదీన చేపట్టాల్సిన ప్రజాదీవెన కార్య క్రమాన్ని 'వై.యస్‌.ఆర్‌ కుటుంబం' కార్య క్రమం కారణంగా ఈనెల 26కు వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజాదీవెనలో నగరం లోని ప్రతి ఇంటికొస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. జగనన్న చెప్పిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తామని, ప్రజల దీవెనలతో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నెల్లూరు నగరంలో 'వైయస్‌ఆర్‌ కుటుంబం' ఎంతో విజయవంతమైందని, 40వేల కుటుంబాలు పార్టీకి చేరువయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ ఎం.ద్వారకానాథ్‌, కార్పొరేషన్‌ వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

galpikaఅది ద్వారకా నగరం. సత్యభామ టీవీలో జిమ్‌జామ్‌ ఛానెల్‌ పెట్టుకుని 'తన్నితే పెళ్ళాం చేతే తన్నించుకోవాలి' సీరియల్‌ 18,472వ ఎపిసోడ్‌ చూస్తోంది. దాదాపు 10,411వ ఎపిసోడ్‌ నుండి మొగుడిని పెళ్లాం తన్నే సీన్‌లే తిప్పి తిప్పి చూపిస్తూ ఆ ఛానల్‌ వాళ్ళు మగజాతి పట్ల వున్న తమ విద్వేషాన్ని చాటుకుంటున్నారు. కరెక్ట్‌గా పెళ్లాం తంతే మొగుడు ఎగిరి గోడ మీద పడతాడు. ఆ సస్పెన్స్‌లోనే సీరియల్‌లో బ్రేక్‌... అప్పుడే లలితా జ్యూయలరీ యాడ్‌లో గుండు బాస్‌ వచ్చాడు. బంగారం ఎక్కడ కొంటున్నారు... ఇతర షాపులలో సరిచూసుకుం టున్నారా... అంటూ ప్రకటనలో చెబుతుండగా... ''నారాయణ నారాయణ'' అంటూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. రాగానే టీవీలో వస్తున్న లలిత జ్యూయలరీ గుండుబాస్‌ యాడ్‌ చూసాడు. సత్యభామతో... నిన్న ఇతన్ని ఎక్కడో చూసానమ్మా... అని అన్నాడు. ఎక్కడ స్వామీ అని సత్యభామ అడిగింది. ఆ గుర్తొచ్చిందమ్మా... నిన్న మీ శ్రీవారు కృష్ణ భగవానుడు, నేను చెన్నైలోని లలిత జ్యూయలర్స్‌కు వెళ్లాం.. అక్కడే ఈ గుండతన్ని చూసాను అని అన్నాడు. లలిత జ్యూయలర్స్‌కు వెళ్లారా... ఏం కొన్నారు స్వామీ అని సత్యభామ ఆతృతగా అడిగింది. దానికి నారదుడు... అదే 50లక్షల ఖరీదు చేసే డైమండ్‌ నక్లెస్‌ సెట్‌ అమ్మా... ఇంతకీ నీ వద్దకు తేలేదా అని నారదుడు నసుగుతూ అడిగాడు. నా వద్దకు తేలేదు స్వామీ అని సత్య చెప్పింది. అలాగైతే ఎక్కడ ఇచ్చి వుంటాడో, ఎవరికి ఇచ్చి వుంటాడో అంటూ నారదుడు అగ్గిపుల్ల గీసేసాడు. సత్యభామ ఆవేశంతో వూగిపోయింది. అప్పుడే పిల్లనగ్రోవి వూదుకుంటూ శ్రీకృష్ణుడు ఇంట్లో అడుగుపెట్టాడు. అలా అడుగుపెట్టాడో లేదో ఒళ్లంతా సెగ... ఏందబ్బా ఇంత సెగ వుందని లోపలకు చూసాడు. ఎదురుగా నారద మహర్షి కనిపించాడు. అప్పుడే కృష్ణుడి ఎడమకన్ను అదిరింది. గుండెలో రాయిపడ్డట్లయ్యింది. ఈ అగ్గిపుల్ల స్వామి ఏదో మంట పెట్టేసాడు. ఇప్పుడు ఈ మంటను ఆర్పాలంటే ఎన్ని ఫైరింజన్‌లను పిలిపించాలో ఏమో అనుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ బెడ్‌మీద కూర్చుని సత్యభామ బుసలు కొడుతుంది. కృష్ణుడికి పరిస్థితి అర్ధమయ్యింది. సత్య అంటూ ఆమె భుజంపై ప్రేమగా చేయి వేసాడు. అంతే ఆమె విసిరిన విసురుకు బయటకొచ్చి పడ్డాడు. మళ్ళీ లేచి నడుము సర్దుకుని నారదుడి వద్దకు వెళ్లి.... ఈ సెగకు కారణమేంటని అడిగాడు. నిన్న లలిత జ్యూయలర్స్‌లో కొన్న డైమండ్‌ నక్లెస్‌ అని నారదుడు చెప్పాడు. నీ నోటికంటే తెలుగు న్యూస్‌ ఛానెల్స్‌ నయం నారదా అంటూ శ్రీకృష్ణుడు నిదానంగా సత్యభామ వద్దకు వెళ్లాడు. సత్య... నువ్వు నా మనసును అర్ధం చేసుకోలేదు. నిన్న నేను కొన్న ఆ డైమండ్‌ నీ సుందరమైన ముఖానికి ఏ మాత్రం సరిపోదు. అందుకే దానిని రుక్మిణికిచ్చేసా.... రేపు ఎలాగూ దీపావళి... స్వయంగా భూలోకానికే వెళదాం... అక్కడ నీకు సెట్‌ అయ్యే డైమండ్‌ సెట్‌ను నువ్వే సెలక్ట్‌చేసుకో... రుక్మిణికి ఇచ్చింది 50లక్షల నక్లెస్సే! నీకు కోటి రూపాయలు ఖరీదు చేసే డైమండ్‌ సెట్‌ తీసిస్తా కదా అని హామీ ఇచ్చి బయటకొచ్చాడు. అక్కడ నారదుడు... ఏం ప్రభూ... ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యిందా అని అడిగాడు. నువ్వు అగ్గి పెట్టావు కదా... దానిని ఆర్పుకోవాలంటే ఇంకో కోటి ఖర్చు... ఖర్చు మాట ఎలాగున్నా... ఆ మోడీతో ఇన్‌కంటాక్స్‌ బాధ వొకటి అని వాపోయాడు.

చెన్నైలోని లలిత జ్యూయలర్స్‌ షాపు. మారువేషంలో శ్రీ కృష్ణుడు, సత్యభామ, నారదుడు అక్కడకు వెళ్లారు. సత్యభామ ఓ డైమండ్‌ సెట్‌ను చూసింది. దాని మీద రేటు 95,00,000/- అని వుంది. నారదుడు టక్కున... అమ్మా... దీనికంటే కూడా ఆ ఎర్రరాళ్ళ సెట్‌ బాగుంది చూడు అని ఇంకోవైపు చూపించాడు. దాని క్రింద రేటు 1,75,00,000/- రూపాయలు అని వుంది. ఆ రేటును చూడగానే కృష్ణుడి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. పెళ్లికి పోతూ పిల్లిని చంకలో పెట్టుకోవడం అంటే ఇదే... ఈ నారదుడిని వెంటబెట్టుకుని రాకుండా వున్నా బాగుండేది అని అనుకుంటూ బిల్లు చెల్లించడానికి కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. జిఎస్టీతో కలిపి కోటి 90లక్షలు కట్టేసాడు. ఆ షాపు అధినేత గుండూ బాస్‌ వీళ్ళతో... ఇప్పుడు తక్కువ అమౌంట్‌తో షాపింగ్‌ చేసారు సార్‌... ఈసారి షాపింగ్‌కు వచ్చినప్పుడు మేడమ్‌కు ఖరీదైన నగలు తీసివ్వాలి ఆల్‌ ది బెస్ట్‌ అని అన్నాడు. కోటి 90లక్షలు వీడికి చీప్‌గా కనిపిస్తున్నాయా అని కృష్ణుడు మనసులో అనుకుని... అక్కడనుండి బయటపడ్డారు. తెలుగు ప్రజలు దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో చూద్దామని ఐఆర్‌ 20 - 420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరానికి వచ్చారు. మొదట నైట్‌రైడర్‌, మంత్రి నారాయణ ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఎలాంటి బాణాసంచా వెలుగులు లేవు. అక్కడ వున్న సెక్యూరిటీతో... మీ సార్‌, దీపావళి చేసుకోవడం లేదా అని నారదుడు ప్రశ్నించాడు. అందుకు సెక్యూరిటీ... మా సార్‌ ఏ అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడు పోతాడో తెలియదు. ఇక దీపావళి పండుగ కూడానా? అని చెప్పాడు. తర్వాత వీళ్ళు చిల్డ్రన్స్‌పార్క్‌ వద్ద వున్న గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి ముందు కూడా దీపావళి వాతావరణం లేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సతీమణి సునందతో సత్యభామ వుండి... దీపావళి ఎందుకు చేసుకోవడం లేదని అడిగింది. 'మన ఎమ్మెల్యే మన ఇంటికి' అంటూ మావారు వెళ్లిపోయారు. ఆయన మా నియోజకవర్గ ప్రజల ఇళ్లల్లో ఎక్కడో ఒక చోట వారితో కలిసి దీపావళి పండుగ చేసుకుంటాడు. ఈసారి మాకు టపాసుల ఖర్చు తగ్గించాడు. అసలే జిఎస్‌టి దెబ్బకు టపాసులు కొనేటట్లు లేవు అని చెప్పింది. కృష్ణుడు బ్యాచ్‌ అక్కడనుండి బయలుదేరి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పి.అనిల్‌ కుమార్‌యాదవ్‌... ఇలా అందరు ఇళ్ల దగ్గర చూసారు. ఎక్కడా టపాసుల మోతే లేదు. అందరూ జిఎస్‌టి దెబ్బకు టపాసులు కొనలేదని చెప్పారు. అప్పుడే ఏ.సి సెంటర్‌ ప్రాంతంలో ''ఢాం ఢాం తుస్‌... టప... ఫట్‌ ఫట్‌'' అంటూ పెద్దఎత్తున టపాసుల శబ్దాలు రావడంతో కృష్ణుడు, సత్య, నారదుడు అక్కడకు పరుగెత్తారు. అక్కడ కళ్లకు నల్లద్దాలు పెట్టివున్న స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(66) కనిపించాడు. అక్కడ టపాసులేమీ లేవు కాని... ఢాం ఢాం అంటూ చెవులు పగిలి పోయే శబ్దాలు వస్తున్నాయి. టపాసులు కనిపించడం లేదు. ఈ శబ్దాలేంటి నాయనా అని వివేకాను కృష్ణుడు అడిగాడు. టపాసుల శబ్దాలే స్వామీ... అదిగో శబ్దాలు అక్కడ నుండి వస్తున్నాయి అంటూ ఓ పక్కన చూపించాడు. అక్కడ పెద్దపెద్ద స్పీకర్‌లు వున్నాయి. సి.డి పెట్టి రికార్డ్‌డ్‌ టపాసుల శబ్దాలు వింటూ దీపావళి టపాసులను కాలుస్తున్నంత ఆనందంగా వున్నారు. ఇదేం దీపావళి నాయనా అని కృష్ణుడు అడిగాడు. ఏం చేసేము స్వామీ... జిఎస్టీ దెబ్బకు టపాసులు కొనేటట్లున్నాయా... అందుకే ఈ రకంగా దీపావళి చేసుకుంటున్నాం అని వివేకా చెప్పాడు. ఆ మాట వినగానే కృష్ణుడికి 'అహనా పెళ్లంట' సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి ఒట్టి అన్నం తినే సీన్‌ గుర్తుకొచ్చింది.

Page 1 of 924

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
  నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • కావలి నాకే కావాలి
  వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
 • ఆనంకు చుక్కెదురు?
  నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
 • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
  మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter