Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 23

1Ariesమేషం

ఉద్యోగులకు పని వత్తిడి, శ్రమ ఎక్కువగా ఉం టుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తమ అధికారులతో, సహచరులతో జాగ్ర త్తగా మెలగండి. ఆరోగ్యం స్వల్ప ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఖర్చుల భారం పెరుగు తుంది. అయినా అవసరాలలో డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, శ్రమ ఉం టుంది. పెద్దమొత్తాలలో లావాదేవీలను వాయిదా వేయండి. కొత్త పరిచయాలు బలపడతాయి. విద్యార్థు లకు పరీక్షలు తృప్తి కలిగించగలవు. శుభకార్యములకై ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ప్రయాణాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి బాగుండి ఆదాయము సంతృప్తికరము. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

3Geminiమిధునం

సభలు సమావేశాలలో ప్రముఖ బాధ్యతలు నిర్వహి స్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలు బాగుం టాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, కార్యసమర్ధత బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కాంట్రా క్టులు లభించగలవు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. బంధుమిత్రులకు సహాయపడతారు.

 

4Cancerకర్కాటకం

కుటుంబసభ్యులతో కొద్ది విభేదాలు చోటు చేసు కొంటాయి. ఉద్యోగులకు అధికారులతో సన్నిహితత్వం ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. దిగువ ఉద్యో గులలో, వర్కర్లలో పేచీలు రాకుండా జాగ్రత్త పడాలి. పరీక్షలను చక్కగా వ్రాస్తారు. ఆరోగ్యం ఫరవాలేదు. అనవసర విషయాలపై ఆందోళన చెందవద్దు. అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి.

 

5Leoసింహం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. కుటుంబసౌఖ్యముండును. వృత్తి, ఉద్యోగులకు రాబడి పెరుగుతుంది. బంధువులతో అభిప్రాయ భేదాలుం టాయి. పరీక్షలందు శ్రద్ధ చూపాలి విద్యార్థులు. పనుల వత్తిడి మరియు అనుకున్న పనులు సవ్యంగా జరగక టెన్షన్‌ పడుతుంటారు. వ్యాపారవృద్ధి సరిగా ఉండదు. ఆర్ధికావకాశాలు చేజారిపోయే పరిస్థితులుంటాయి.

 

6Virgoకన్య

ఉద్యోగులకు కార్యసమర్ధత గుర్తింపు గౌరవాలు, అధికారుల అభిమానం పొందుతారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు. కొత్త పరిచయాలు వ్యాపకాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక స్థితి బాగుండి వ్యాపార వృద్ధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్లపై లాభాలుంటాయి.

 

7Libraతుల

బంధువర్గంతో విభేదాలు చోటు చేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మొగమాటాలకు వత్తిళ్ళకు లొంగవద్దు. ఉద్యోగులు తమ అధికారులతో పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. శుభకార్యాల నిర్ణ యంలో అనుకూలత తక్కువ. అనుకోని ప్రయాణాలుం టాయి. ఆర్ధిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. స్థిరాస్తుల లావా దేవీలు వాయిదా వేసికొనండి. ఉద్యోగులు విధి నిర్వ హణలో జాగ్రత్త వహించండి. సమస్యలను పరిష్కరించు కొనే చొరవ చూపుతారు. పరీక్షలు వ్రాయడం బాగుం టుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చిన్న గాయాలు తగిలే అవకాశం ఉన్నది. అనుకున్న పనులు నిదానంగా జరిగి సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

విద్యార్థులకు మంచి సామర్థ్యముంటుంది. విదేశీ ప్రయాణాలకు అనుమతులు, ప్రభుత్వం నుండి ఆర్ధిక అనుమతులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, గృహోపకరణాలు కొత్తవి సమకూర్చు కొనడం, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపా రాలు నిర్వహించే వారికి, కాంట్రాక్టర్లకు ఆర్ధిక అవకా శాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొం టారు. బంధువర్గం నుండి శుభవార్తలు వింటారు. కోర్టు కేసులందు అనుకూలత కలదు. పరీక్షలను విద్యార్థులు బాగా వ్రాస్తారు. వృత్తి ఉపాధి పథకాలలో నిలద్రొక్కుకొని, ఆదాయం పెంచుకొంటారు. అనుకొన్న పనులకు ఆటంకాలు కలుగుతుంటాయి.

 

11Aquariusకుంభం

కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. ఉద్యోగుల బాధ్యతలు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. తరచూ ప్రయాణాలుండగలవు. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేపట్టిన పనులను పట్టుదలతో సానుకూలం చేసికొనగలరు.

 

12Piscesమీనం

వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ, స్థాన మార్పులుండవచ్చును. తరచూ ప్రయాణాలుంటాయి. ఉద్యోగార్ధులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారాలను సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

galpikaఢిల్లీలోని ప్రధాని కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అనంతకుమార్‌, స్మృతి ఇరాని, నిర్మలా సీతారామన్‌ తదితరులున్నారు. నరేంద్రమోడీ వుండి వారితో... మన ప్రభుత్వ లక్ష్యాలు ప్రధానంగా రెండు... ఒకటి కాంగ్రెస్‌ రహిత భారత్‌. రెండు క్యాష్‌ రహిత భారత్‌. మొదటి విషయంలో చాలావరకు విజయం సాధించాం. కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలను రాహుల్‌గాంధీకి అప్పగించేసారు కాబట్టి, మిగతాది ఆయన చూసుకుంటాడు. రెండోది క్యాష్‌ రహిత భారత్‌. ఇది ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించాడు. అప్పుడు అరున్‌జైట్లీ... సార్‌, నోట్ల రద్దు ద్వారా చాలామంది వద్దవున్న నగదును ఊడ్చేసాం. ఇక లలిత్‌మోడీ, నీరవ్‌ మోడీ, విజయ్‌మాల్యా వంటి వాళ్ళు బ్యాంకుల వద్ద నగదును ఊడ్చేసే పనిలో వున్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు, నీరవ్‌ మోడీ లాంటివాళ్ళకు ఫ్రీహ్యాండ్‌ ఇస్తే దేశంలో వున్న బ్యాంకులన్నీ క్యాష్‌లెస్‌ బ్యాంకులుగా మారుతాయి. ఇక జిఎస్టీ దెబ్బకు చాలామంది వద్ద డబ్బులేకుండా పోయింది. మనం పారిశ్రామికవేత్తలకు ఇలానే వేలకోట్లు ఋణాలు ఇచ్చుకుంటూ పోతే, జిఎస్టీ చట్టాన్ని ఇలాగే కఠినంగా అమలు చేసుకుంటూపోతే త్వరలోనే మనం క్యాష్‌ రహిత భారత్‌ను చూడగలం సార్‌. ఆ నమ్మకం నాకుంది అని చెప్పాడు. దానికి మోడీ... సరే ఆ ఇష్యూను మీరు హ్యాండిల్‌ చేయండి, ఇక ఏపి వాళ్ళ ప్రత్యేకహోదా గొడవ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. దానికి జైట్లీ... ఏపికి ప్రత్యేకహోదా కోసం తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించాడు. అంతేకాదు, తన పోరాటానికి కలిసి రావాలని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు కూడా పిలుపునిచ్చాడు అని చెప్పాడు. జగన్‌ అంత మాటన్నాడా అంటూ నరేంద్రమోడీ కళ్ళు తిరిగి కుర్చీలోనే కూలబడ్డాడు.

----------

విజయవాడ రైల్వేస్టేషన్‌... 7వ నెంబర్‌ ఫ్లాట్‌ఫారం మీద ఢిల్లీకి వెళ్ళే స్పెషల్‌ ట్రైన్‌ ఆగివుంది. అన్ని భోగీల నిండా టీడీపీ, వైసిపి, జనసేన, వామపక్షాల కార్యకర్తలున్నారు. అప్పుడే హైటెక్‌రత్న చంద్రబాబు వచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో 'తెలుగు వీర లేవరా... ప్రత్యేకహోదాకై పోరాడరా' అనే పాట పెట్టారు. చంద్రబాబు బి2 భోగీ వద్ద నిలబడ్డాడు. మంత్రి సోమిరెడ్డి వచ్చి... సార్‌, మీరు ఎక్కి కూర్చోండి అని అడిగాడు. అందుకాయన... ఇంకా జగన్‌ రాలేదు, ఆ అబ్బాయి కూడా వస్తే కలిసి ఎక్కుదాం అని చెప్పాడు. అప్పుడే ఫ్లాట్‌ఫారం మీదకు జగన్‌ వచ్చాడు. వెనుక వేలాదిమంది కార్యకర్తలు బ్యాక్‌గ్రౌండ్‌లో 'జగనన్నా జగనన్నా జగమంతా నువ్వన్నా... ప్రత్యేకహోదాకై పదరన్నా...' అనే పాట వచ్చింది. జగన్‌ నేరుగా బి2 భోగీ వద్దకు వెళ్లాడు. చంద్రబాబు ఎంతో అభిమానంగా జగన్‌ను కౌగిలించుకుని... జగన్‌ మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఢిల్లీ నుండి కదిలేదిలేదన్నాడు. దానికి జగన్‌... నేనెప్పుడో సిద్ధం... అందుకోసం ఓ పదిజతల బట్టలు కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు. ఈలోపల వామపక్షాల నాయకులు మధు, నారాయణ, రామకృష్ణ, లోక్‌సత్తా జేపి,

ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా వచ్చి అదే భోగీ ఎక్కారు. అప్పుడే సిగ్నల్‌ ఇవ్వడంతో రైలు కదలసాగింది. ఇక ఎక్కు జగన్‌ అని చంద్రబాబు అన్నాడు. మన పవన్‌ ఇంకా రాలేద్సార్‌ అని జగన్‌ చెప్పాడు. పవన్‌ ఫ్లైట్‌కేమన్నా వస్తాడేమోలే అని చంద్రబాబు అన్నాడు. లేదు, మనతో పాటే రైలులో వస్తానన్నాడు. మనతో కలిసే జర్నీ చేయాలని ఉందంట అని జగన్‌ చెప్పాడు. చైన్‌ అన్నా లాగి ట్రైన్‌ను ఆపుదామా అని చంద్రబాబు అడిగాడు. అడుగో వచ్చేస్తున్నాడు. ఫర్వాలేదు. ఇక ఎక్కేయండి అని జగన్‌ చెప్పాడు. చంద్రబాబు, జగన్‌లు ట్రైన్‌ ఎక్కి డోర్‌ వద్ద నిలబడ్డారు. పవన్‌ భుజాన బ్యాగ్‌తో పరుగెత్తుకుంటూ భోగీ వద్దకు వచ్చాడు. జగన్‌ డోర్‌ వద్ద నిలబడే చేయి చాచాడు. పవన్‌ ఆ చేయి పట్టుకుని ట్రైన్‌లోకి జంప్‌ చేశాడు. ఢిల్లీ వైపు ట్రైన్‌ దూసుకుపోసాగింది. బి2 భోగీలో ఏపి నేతలందరూ ఒకరితో ఒకరు సరదాగా వుండ సాగారు. జగన్‌ తాను తెచ్చుకున్న వేరుశెనగ ముద్దలను అందరికీ పంచితే, చంద్రబాబు బాదంపప్పు, జీడిపప్పు, హెరిటేజ్‌ మజ్జిగ ప్యాకెట్లను అందరికీ ఇచ్చాడు. పవన్‌, జగన్‌లైతే ట్రైన్‌ ఢిల్లీకి వెళ్ళే వరకు కూడా ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుని ఎంతో స్నేహంగా వుంటూ ఏపికి ప్రత్యేకహోదా మీదనే చర్చించుకోసాగారు. రైలు ఢిల్లీకి చేరింది. నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రధాని కార్యాలయం ముందు నిరాహారదీక్షకు కూర్చున్నారు. చంద్రబాబు వుండి... మోడీ, ఇక్కడితో నీ వేషాలు ఆపు... మమ్మల్ని ప్యాకేజీతో మభ్యపెట్టాలని చూసావో ఖబడ్దార్‌... ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు ఇక్కడినుండి కదిలేది లేదు. నాలో జాలి, దయ ఎక్కువుగా వుండబట్టి ఇప్పటిదాకా నీ జోలికి రాలేదు, నేను కేంద్రంలో చక్రం తిప్పడం మొదలుపెట్టానో నీ చక్రం ఆగిపోతుంది. అని హెచ్చరించాడు. తర్వాత జగన్‌, పవన్‌, ఉండవల్లి, జెపి, మధులు కూడా మాట్లాడి హోదా ఇవ్వకుంటే మిమ్మల్ని గోదాట్లో కలిపేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. వెంటనే అక్కడ కూర్చున్న కార్యకర్తలందరు కూడా ''హోదా ఇవ్వాలి... హోదా ఇవ్వాలి'' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయసాగారు.

ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదు. లెక్కలు చెప్పి ప్యాకేజీ తీసుకోండి. మీ చంద్రబాబు అవినీతి పరుడు. మేం ఇచ్చిన నిధులన్నింటిని జల్సా చేస్తున్నాడు. మీరెంత అరిచినా హోదా ఇవ్వను, హోదా ఇవ్వను... అని ప్రధాని నరేంద్రమోడీ కలవరించసాగాడు. రాజ్‌నాథ్‌సింగ్‌ వెంటనే టేబుల్‌ గ్లాస్‌లో వున్న నీళ్ళను మోడీ ముఖాన చల్లాడు. అప్పుడు మోడీ కళ్ళు తెరిచాడు. అప్పటిదాకా తనకు వచ్చింది కల అని తెలుసుకోవడానికి అతనికి పది నిముషాలు పట్టింది. మోడీ ఈ లోకంలోకి వచ్చి... ప్రత్యేకహోదా పోరాటానికి కలిసిరావాలని చంద్రబాబును జగన్‌ కోరాడని చెబితిరి... ఆ షాక్‌తో కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడే ఏపి నేతలంతా కలిసి ఢిల్లీ వచ్చి పోరాడుతున్నట్లు కల వచ్చింది అని చెప్పాడు. అప్పుడు జైట్లీ... సార్‌, వాళ్ళలో అంత యూనిటీ వుంటే అసలు ఏపినే విడిపోయేది కాదు, భూమి ఆకాశాలు కలవవన్నది ఎంత నిజమో, ఏపి సమస్యల కోసం ఆ రాష్ట్ర నేతలు కలవరన్నది అంత నిజం. వీళ్ళు తమిళనాడు లాంటి డేంజర్స్‌ కాదు, మనం హాయిగా వుండొచ్చు అని చెప్పి లేచాడు.

ranganనెల్లూరు రంగనాయకులపేటలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ త్పగిరి రంగ నాథస్వామి వారి దేవస్థానంలో ఈ నె 25వ తేదీ నుంచి మార్చి 8వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈమేరకు ఈ నె 20న దేవస్థానం ప్రాంగణంలో ఆయ ఛైర్మెన్‌ మంచికంటి సుధాకర్‌రావు, ఇ.ఓ కోవూరు జనార్ధన్‌రెడ్డి బ్రహ్మోత్సవా ఆహ్వానపత్రికు, గోడ పత్రికను ఆవిష్క రించారు. మార్చి 2న గరుడసేవ, 3న కళ్యాణం, 4న రథోత్సవం, 8వ తేదీ తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వ హించనున్నారు.

Page 1 of 995

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
  జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
 • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
  దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
 • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
  రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter