Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

rasi 17

1Ariesమేషం

ప్రలోభాలకు లొంగకుండా ఉద్యోగులు పని చేయాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కొన్ని ముఖ్య విషయాలు ఎవరితోను అనవద్దు. అనుకోని ప్రయా ణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపా రాలు లాభదాయకంగా సాగుతాయి.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు, పనివత్తిడి వుంటుంది. విలువైన వస్తువులను పదిలపరచుకొనండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఒక ముఖ్య కార్యం మీద శ్రద్ధ చూపుతారు. కోర్టు వ్యవహారములందు అనుకూలత కలదు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో వ్యాప్తి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

3Geminiమిధునం

విలువైన వస్తువులు సమకూరడం, దూరప్రయాణా లుంటాయి. బిడ్డల వివాహ విద్యా విషయములపై శ్రద్ధ పెడతారు. అధికారులకు మంచి గుర్తింపు గౌరవాలుం టాయి. ఆరోగ్యం, విద్యా ప్రగతి బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందుల, వ్యవహారంలో ఇబ్బందులు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తృతి మరియు ఆదాయ వృద్ధి కలదు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరుగవచ్చును.

 

4Cancerకర్కాటకం

ఒక మంచి పనికి సంసిద్ధులై కృషి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. క్రొత్త ఆర్ధికావకాశాలు త్వరలో లభించగలవు. ఆరోగ్యం ఫరవాలేదు. వ్యవహారాలలో తొందరపాటు ప్రదర్శించకండి. ఇబ్బందికరమగు పరిస్థి తులు క్రమంగా చక్కబడగలవు. శుభవార్తలు వింటారు. ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

5Leoసింహం

వస్తు, వాహన, ఇంటి రిపేర్లు ఖర్చులు అదనం. విద్యాప్రగతి బాగుంటుంది. అనుకున్న పనులు టెన్షన్‌తో సాగుతాయి. నష్టాలను అటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సభలు సమావేశాలలో మీదే కీలకపాత్ర వుంటుంది. ముఖ్య నోటీసులు అందుకుంటారు. పను లందు టెన్షన్‌ ఎక్కువగా వుంటుంది. ఆర్ధిక పరిస్థితి క్రమంగా బాగుంటుంది. ఖర్చులు అదుపుచేయాలి.

 

6Virgoకన్య

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం. కోర్టుకేసులు వాయిదా పడడం, బంధు ముఖ్యులలో ఒకరికి అనారోగ్య బాధలుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. చేయదలచిన పనులందు ఆర్ధిక వ్యవహారా లందు పొరపాట్లు రాకుండా చూచుకొనాలి.

 

7Libraతుల

బిడ్డల విద్యా ఉద్యోగ శుభకార్యాల విషయాలు ఆందోళన కలిగిస్తాయి. అనుకున్న పనులు జరుపుకొన డానికి శ్రమపడాల్సి వుంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదాపతాయి. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. అనుకోని ఖర్చులుంటాయి. ఇంట్లో అనారోగ్య బాధితులుంటారు.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూరప్రయా ణాలుంటాయి. సన్నిహితులే ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. కొత్త వస్తువులు ఇంటికి సమకూరతాయి. విద్యా ప్రగతి, ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులకు సహాయ పడతారు. బంధుత్వ స్నేహాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అవకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరిగి అభివృద్ధి వుంటుంది.

 

9Sagittariusధనుస్సు

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, బంధుమిత్ర వర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పెట్టు బడులు, స్థిరాస్తుల లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సౌఖ్యం, ప్రముఖులతో పరిచయాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుట, మంచి ఆర్ధికాభివృద్ధి అవకాశాలు లభించడం జరుగుతుంది. తొరదరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా జాగ్రత్తపడండి.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా వుంటాయి. వ్యవహారాలలో మీకు మంచి విలువ వుంటుంది. కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులు, ఇతరు లతో జాగ్రత్తగా మెలగండి. వ్యాపారులకు, ఉద్యోగులకు అధికారుల వత్తిడి వుంటుంది. విద్యాప్రగతి బాగుం టుంది. కుటుంబంలో కొంత అనుకూలత లేకున్నా సర్దుబాటు చేసుకుంటారు. ఖర్చులు అధికంగా వుంటాయి.

 

11Aquariusకుంభం

శుభకార్య నిర్ణయాలు జరుగుతాయి. ఇతరుల పనుల మీద ప్రయాణాలుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. కాంట్రాక్టు పనులు, గృహనిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు జరుగవచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగులు తమ అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పనిసరిగా వుంటాయి. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. విద్యాప్రగతి బాగుంటుంది. కుటుంబసౌఖ్యం కలదు. పనులు సక్రమంగా సానుకూలంగా జరుగు తాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి.

voteకర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో 2019లో డైరక్ట్‌గా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాలనుకుంటున్న చంద్రబాబుకు 'నంద్యాల' రూపంలో సెమీ ఫైనల్స్‌ ఆడాల్సివస్తోంది.

రాష్ట్రంలో ఏ ఒక్క అసెంబ్లీకి కూడా ఉపఎన్నికలు జరిపించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అలా జరిగి తెలుగుదేశం బోర్లా పడితే తమ పతనం అక్కడనుండే మొదలవుతుందని, ఒక అసెంబ్లీ ఎన్నిక ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుందని చంద్రబాబు భయం. ఆ భయంతోనే ఆయన ఏదో ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి తన కొడుకు లోకేష్‌ను ఉపఎన్నిక ద్వారా శాసనసభకు పంపించే అవకాశ మున్నా, ఆ సాహసం చేయలేక శాసనమండలికి పంపించాడు.

ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికను తప్పించుకోలేని పరిస్థితి. మన రాష్ట్రంలో ఒక సాంప్రదాయం వుంది. ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా చనిపోతే, ఆ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో సదరు సభ్యుడి కుటుంబసభ్యులు పోటీచేస్తే ప్రతిపక్షం పోటీ పెట్టదు. అయితే ఇంతవరకు ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారంతా కూడా పార్టీ గుర్తు మీద గెలిచాక ఆ పార్టీలో ఉంటూ చనిపోయిన వాళ్ళే! కాని, ఇక్కడ భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. ఏడాది తర్వాత తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడిగా మృతిచెందాడు. కాబట్టి నంద్యాల అసెంబ్లీ సీటు మాది అన్నది జగన్‌ వాదన. ఆ సీటు మాది కాబట్టే మేం పోటీకి దిగుతామంటున్నాడు.

జగన్‌ వాదనతో ఏకీభవించి చంద్రబాబు అభ్యర్థిని పెట్టకుండా ఉండలేడు, ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే! మరణించిన నాయకుడి కుటుంబసభ్యులను పోటీకి దించితేనే కొంతన్నా సానుభూతి ఉంటుంది. కాని ఇక్కడ చూస్తే నాగిరెడ్డి పెద్దకూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో కూతురు, కొడుకు చిన్నపిల్లలు. వారిని పోటీకి దించడం కష్టమే! ఆ కుటుంబసభ్యులు కాకపోతే కనీసం సానుభూతి కూడా పనిచేయదు. ఇక 2014 ఎన్నికల్లో నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డిని దించాలి. ఆయనను దించితే భూమా వర్గీయులు పనిచేయరు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేస్తోంది. ఒకవేళ శిల్పా మోహన్‌రెడ్డికి తెలుగుదేశం సీటివ్వకపోతే, ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడానికి వైకాపా రెడీగావుంది. మారిన పరిస్థితుల్లో భూమా మృతి పట్ల కూడా పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం లేకపోవడం తెలుగుదేశంకు ఇబ్బందికర వాతావరణమే! కర్నూలుజిల్లాలో వైకాపా బలంగా ఉండడం, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుండడం, కోట్ల కుటుంబం వైకాపాలో చేరుతుండడం, తెలుగుదేశంపై కె.ఇ సోదరులు అసంతృప్తిగా ఉండడం వంటి పరిణామాలన్నీ వైకాపాకు కలిసొచ్చేవే!

yanamalaబాబుగారి బడ్జెట్‌ అంతా బడాయి బడ్జెట్‌గానే వుంది. కాకిలెక్కలతో.. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బడ్జెట్‌ ఎంత గొప్పగావుందో అన్నట్లుగా అత్యద్భుతంగా రూపొందిం చారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల నిప్పుల్లో కాగిపోతోందంటూనే, బడ్జెట్‌ వచ్చేసరికి భారీగా కేటాయింపులు చేసేయడం ఎలా కుదురుతోందో మరి!రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన నవ్యాంధ్ర తొలి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూసి ఎవరైనాసరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఆచరణ కొచ్చేసరికి ఖర్చుపెట్టేది అంతంతమాత్ర మేనన్నది వేరే విషయం. ఆ అరకొరా కూడా అసలైన లబ్దిదారులకు చేరుతు న్నాయా అంటే అదీ లేదు. అంతా ఆర్భా టమే తప్ప, అభివృద్ధి మాత్రం వుండదు. చంద్రబాబు హైటెక్‌ బడ్జెట్‌ ఇలాగే వుం టుంది. ప్రాధాన్యతారంగాలకు బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యత లేదు. వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం, స్త్రీ శిశుసంక్షేమం..వంటి రంగాలు ఇంకా నిధుల లేమితో విలవిలలాడుతూనే వున్నాయి. భారీ కేటాయింపులుంటే తప్ప ఈ రంగాల పరిస్థితి ఒక కొలిక్కి రాదు. అయినా, బడ్జెట్‌లో అంత కేటాయింపులు అసలే లేవు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు, బిసి సంక్షేమం వంటివి నేతిబీరలో నేయిలాగానే వుంటు న్నాయి. వాటికి అవసరమైన నిధులు ఎప్పుడో అడుగంటిపోయాయి. నిధుల కోసం అడుగుతూనే వున్నా..'కాకి అరు స్తూనే వుంటుంది.. కరవాడ ఎండుతూనే వుంటుంది'..అన్న సామెతగా ఎన్నో కీలక రంగాలు మూలనబడి కుయ్యోమొర్రో అంటున్నాయి. బడ్జెట్‌ వస్తుంది.. కేటా యింపు వుంటుంది..కానీ అవసరమైన నిధులు మాత్రం వుండవు..ఒకవేళ వున్నా అవి అసలైన లబ్దిదారులకు అందవు. ఇదీ మన దుస్థితి. ఎన్ని బడ్జెట్‌లు వస్తున్నా ఇలాంటి తీరు మారడంలేదన్నదే సామాన్య ప్రజల ఆవేదన. కొత్తబడ్జెట్‌ కూడా ఇం దుకు భిన్నమేమీ కాదు. మరీ యువతకైతే ఈసారి చుక్కలలోకం చూపించారు. నిరుద్యోగులకు ఆశపెట్టి, వారికి భృతి కల్పిస్తామని ఊరించి..ఎన్నికలప్పుడు భారీ ప్రచారాలు చేసుకున్న చంద్రబాబే ఇప్పుడు నిరుద్యోగుల విషయం పట్టించుకోవడం లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అప్పటి దాకా రెండు వేల రూపాయల వంతున నిరుద్యోగభృతి కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మళ్ళీ నీటిమూటలే అయ్యాయి. నిరుద్యోగ భృతి కల్పించాలంటే రాష్ట్రంలో నెలకు కనీసం 3,500 కోట్లన్నా కావాలి. అయితే, అంత డబ్బెక్కడిదీ?.. లేదు కనుకనే నిరుద్యోగభృతి కింద ఓ 5వందల కోట్లిస్తామని ప్రకటించారు. కేటాయింపులైతే చేశారు కానీ, ఇవైనా సక్రమంగా ఆచరణకు వస్తాయన్న నమ్మకం లేదు. కేటాయించిన నిధులు లబ్దిదారు లకు చేరుతున్నాయో...ఇతరుల జేబులు నింపుతున్నాయో అనే విషయం పట్టించు కునే నాధుడే కన్పించడం లేదు. అన్ని పథకాల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి వుండడం లేదు. కాలం గడిచిపోతున్నా ఆ హామీలు ఇప్పట్లో నెరవేరేలా లేదంటూ అటు యువత లోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సకాలంలో జీతాలందితే చాలు..అదే పదివేలు అన్నట్లుంది ఉద్యో గుల పరిస్థితి. ఇకపోతే, అటు రైతులకు గానీ, ఇటు మహిళాలోకానికి గానీ ఆశిం చిన అభివృద్ధి అసలే లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాభావం వల్ల కరు వుతో అల్లాడుతున్నా పట్టించుకునేవారే కరువు. బడ్జెట్‌లో అంతా ఊకదంపుడే తప్ప రైతులకు ఒరిగిందేమీలేదు. వేల కోట్ల రుణాల్లో 'రుణమాఫీ' అవుతోంది కూడా చాలా స్పల్పమే. వేలకోట్లలో వడ్డీని ఇంకా అన్నదాతలు అవస్తలు పడుతూ చెల్లించు కుంటూనే వున్నారు. రైతులకు పంట రుణాలు అసలే అందడం లేదు. నీటి పారుదల వసతులు మునుపటికన్నా ఘనంగా ఏమీ అభివృద్ధి చెందలేదు.

ఉపాధి లేక రైతుకూలీలకు అవస్తలు తప్పడం లేదు. ప్రజలు పనుల్లేక ఊరిడిచి పెట్టి వలసపోతున్నారంటే, 'పనుల్లేక కాదు.. ఎక్కువ డబ్బు కోసం అలా వెళ్ళడం వారికి అలవాటేనని, మనవాళ్ళంతా కమర్షియల్‌గా వుంటారని' ముఖ్యమంత్రి అనడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలో?!.. గత ఏడాది బడ్జెట్‌లో బిసిల సంక్షేమం కోసమని 4430 కోట్లు కేటాయించారు కానీ, బిసిల స్థితిగతుల్లో మాత్రం ఎలాంటి మార్పూ వుండడం లేదు. అదే రకంగా అన్ని రంగాల్లోనూ వుంది. బడ్జెట్‌లో చెప్పే దొకటి..ఆచరణకొచ్చేదొకటి. మేడిపండు బడ్జెట్‌ అంటే ఇదిగో ఇదే.. అన్నట్లుగా వుంది. పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని ఆశ పెడతారే తప్ప.. ఆ పథకమంతా అస్త వ్యస్తమే. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయిం చిన మొత్తాన్నే ఇంకా ఖర్చుపెట్ట లేదు. ఇళ్ళ నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. డ్వాక్రామహిళలకు రుణాలమాఫీ మాట కూడా ఉత్తుత్తిదే. 'చెప్పేవి గొప్పలు.. పెట్టేవి తిప్పలు' అన్న ట్లుగా వుంటోంది చంద్రబాబు బడ్జెట్‌ తీరు. రుణాల మాఫీ అంటారు.. వడ్డీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఇదన్నమాట అభివృద్ధి అంటే. ఇక మహి ళాభ్యుదయం..మహిళా సాధికారత వంటి అంశాలన్నీ ఉపన్యాసాలకే పరిమితాలన్నది బహిరంగ రహస్యమే. ఇలా 'లోపాల కారి'గా వుండడం వల్లనే బడ్జెట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ అనగానే అది తమకు సంబంధించిన అంశం కాద న్నట్లుగా వుండే ధోరణి ప్రజల్లో ప్రబల డానికి పాలకులు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలే కారణం. అందులోనూ మన చంద్రబాబు మాటలకైతే అసలు హద్దులే వుండవు. మాటలు కోటలకోట్లు దాటు తుంటాయే తప్ప, అడుగు మాత్రం అంగుళం కూడా ముందుకు పడదు. ప్రజాధనం సద్వినియోగం చేయాలన్న ధ్యాసే వుండకపోవడం, చిత్తం వచ్చిన రీతిలో కేటాయింపులు చేసేసుకోవడం, నిధుల కేటాయింపులు-వ్యయం పట్ల ఖచ్చితమైన పరిశీలన-పర్యవేక్షణ యం త్రాంగం లేకపోవడం, చివరికి ప్రజల కిచ్చిన హామీలకు గానీ, ప్రజల మాటకు గానీ అసలు విలువలేకపోవడం వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణాలు. 'రాష్ట్ర ప్రగతి.. ప్రజల అభ్యున్నతి'.. మాటల్లోనే తప్ప చేతల్లో చూపలేని నాయకులున్నంత కాలం ఇలాంటి బడాయి బడ్జెట్‌లు ఎన్నొచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది సర్వత్రా జనాభిప్రాయం.

Page 1 of 800

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter