Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

lakshmiనిర్మాతగా, హీరోయిన్ గా, టీవీ ప్రయోక్తగా, ఇలా అన్ని విధాలా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెడుతున్నారు. త్వరలో యుప్ టీవీ ద్వారా మంచు లక్ష్మి కొన్ని వెబ్ సిరీస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో దొంగాట, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త వంటి డిఫరెంట్ సినిమాలు అందించిన వంశీకృష్ణతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుప్ టీవీ ఇటీవల చాలా చురుగ్గా వెబ్ సిరీస్ అందిస్తోంది. ఈ సిరీస్ కోసం పలువురు సినిమా జనాలను ఎంగేజ్ చేస్తోంది. వాళ్ల అనుభవాన్ని వెబ్ సిరీస్ కు వాడుకుంటోంది. ఇప్పుడు అందులో భాగంగానే మంచులక్ష్మి-వంశీకృష్ణ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టును ఓకె చేసినట్లు వినికిడి. అయితే జోనర్ ఏమిటన్నది ఇంకా తెలియదు. ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా వుంటుందని మాత్రం తెలుస్తోంది. 

tapsiఇకపై తెలుగు సినిమాలకి గ్యాప్‌ ఇవ్వదట తాప్సీ. వీలైనంత ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తానంటూ ఈ మధ్యన ఇంటర్వ్యూల్లో తెగ ఊదరగొట్టేస్తోంది. ఏంటో, వున్నపళంగా తాప్సీకి తెలుగు సినీ పరిశ్రమ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందని అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.  ఆ మధ్య తెలుగు సినిమాపై తాప్సీ ఎడా పెడా సెటైర్లు దంచేసింది. అదంతా బహుశా 'బాలీవుడ్‌ కావరం' అనుకోవాలేమో.! దర్శకేంద్రుడి మీద సెటైర్లు వేసింది. తెలుగు సినిమాల్లో గ్లామర్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.. అసలంటూ తెలుగు సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు హీరోయిన్లదాకా రావని తెగేసి చెప్పింది. అంతలోనే ఇంత మార్పా.? ఆశ్చర్యకరమే ఇది.  ఏమో, తాప్సీకి ఎలా జ్ఞానోదయమయ్యిందోగానీ, 'ఆనందో బ్రహ్మ' ప్రమోషన్స్‌ కోసం హైద్రాబాద్‌కి వచ్చింది మొదలు తాప్సీలో చాలా మార్పులు కన్పిస్తున్నాయి. గ్లామరస్‌ పాత్రల్లోనూ కన్పిస్తానంటోంది. ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తానంటోంది. తెలుగు సినిమాకి అసలు దూరమే అవ్వలేదని చెప్పుకొచ్చింది కూడా. బాలీవుడ్‌లో రెండు మూడు హిట్స్‌ తగిలాక, టాలీవుడ్‌ మీద సెటైర్లు షురూ చేసిన తాప్సీలో ఇంత మార్పుకి కారణమేంటట.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.

sridevi dauthsaఅలనాటి అందాల సుందరి శ్రీదేవి, వయసు మీద పడ్తున్నా తరగని అందంతో ఇప్పటికీ హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిస్తోన్న విషయం విదితమే. అడపా దడపా కూతుళ్ళతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఆ ఫొటోల్ని మీడియాకి అందిస్తూ వస్తోంది శ్రీదేవి. ఆ ఫొటోల్లో ఒక్కోసారి శ్రీదేవి సైతం బికినీలో కనిపిస్తుండడం గమనార్హం. 

ఇక, కొత్త ఇన్నింగ్స్‌లో నెమ్మది నెమ్మదిగా సినిమాలు చేస్తోన్న శ్రీదేవి, ఇంకోపక్క కుమార్తె జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు పక్కా స్కెచ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌ ఫీచర్స్‌ కోసం జాన్వీని జిమ్‌ల చుట్టూ తిప్పుతోంది.  తల్లికి తగ్గ అందం కాకపోయినా, జాన్వీ కూడా ఈ మధ్య గ్లామర్‌ పెంచుకుంటూ వెళ్తోంది. జాన్వీతోపాటుగా శ్రీదేవి మరో కుమార్తె కుషీ కూడా గ్లామరస్‌గా ఫొటోలకు పోజులిచ్చేస్తోంది. అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ తమ తల్లి శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో ఇదిగో ఇలా దర్శనమిచ్చారు. జాన్వీ ఓ అడుగు ముందుకేసి బ్యాక్‌లెస్‌ టాప్‌తో అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

Page 1 of 887

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter