You are here: Home Forum
Welcome, Guest
జిల్లలో కాని , టౌన్ లో కాని ఏవయినా ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తే తప్పక ఇక్కడ రాయండి .... అధికారులు కాని , నాయకులు కాని వాటి పై ద్రుష్టి సారించి సమస్య పరిష్కారానికి తోడ్పడుదాం
  • Page:
  • 1

TOPIC: సగం - సగం పనులు

సగం - సగం పనులు 3 years, 7 months ago #8

సగం - సగం పనులు

నెల్లూరు లో అన్నమయ్య సర్కిల్ నుంచి గొలగమూడి పొయ్యే దారి ఈమధ్య అభివృద్ధి చేస్తున్నారు , ఉన్నట్లుండి పనులు సగం లో ఆపేశారు. ఎన్నికల ముందు అయితేనేం పని జరుగుతుంది కదా అని సంతోషించేలోపే పనులు ఆగిపొయాయి. కల్వర్ట్ పనులు వదిలేసారు , దీని వలన రోడ్డు బాగుపడటం అటుంచి ఎవరయినా వేగంగా వచ్చి వాటిలో పడ్డారంటే ఇక ఇంతే సంగతులు . ఎవరయినా ముందు కల్వర్ట్ పనులు ముందు చేసి తరువాత శుభ్రంగా గతుకులు లేకుండా రోడ్డు వేస్తారు . ఎన్నికల హడావుడి లో కాసుల కక్కుర్తి తో ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం బాగాలేదు . ఇప్పటికయినా అధికారులు కాంట్రాక్టర్ మిద తగు చర్యలు తీసుకోవాలి
  • Page:
  • 1
Time to create page: 2.62 seconds

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter